సందీప్ వంగాకు షాక్.. సినిమా ఆగిందా?
Send us your feedback to audioarticles@vaarta.com
తొలి చిత్రం `అర్జున్ రెడ్డి`తో తెలుగులో భారీ హిట్‌ను సొంతం చేసుకున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ స్టార్ హీరోగా ఎదిగాడు. తర్వాత సందీప్ తన మకాంను ముంబైకి మార్చాడు. తెలుగులో తనకు డైరెక్టర్‌గా పేరు తెచ్చిన అర్జున్ రెడ్డి చిత్రాన్నే కబీర్ సింగ్ పేరుతో తెరకెక్కించి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. 2019లో విడుదలైన బాలీవుడ్ చిత్రాలన్నింటిలో కబీర్ సింగ్ భారీ విజయాన్ని దక్కించుకుంది.
షాహిద్‌కపూర్‌కు ఈ సినిమాతో స్టార్ హీరో రేంజ్ దక్కింది. తర్వాత సందీప్ తన మూడో సినిమాను బాలీవుడ్లోనే స్టార్ట్ చేశాడు. టి సిరీస్ వారితో కలిసి ఓ డార్క్ థ్రిల్లర్‌ను తెరకెక్కించడానికి ప్లాన్ చేశాడు. రణభీర్ కపూర్, రణ్వీర్ సింగ్ వంటి హీరోలతో ఈ సినిమా చేయడానికి సందీప్ గట్టి ప్రయత్నాలే చేశాడు. కానీ ఏవీ ఫలించలేదు. సినీ వర్గాల్లో వినపడుతున్న సమాచారం మేరకు సందీప్ రెండో బాలీవుడ్ చిత్రం ఆగిపోయిందట.
ఇప్పుడు సందీప్ తన మకాంను హైదరాబాద్‌కే మార్చాడట. ప్రభాస్‌తో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడట. అంతా అనుకున్నట్లుగా అయితే మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ప్రభాస్, సందీప్ కాంబినేషన్లో సినిమా ట్రాక్ ఎక్కే అవకాశాలుండొచ్చు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com