ఫుట్ బాల్ ప్లేయర్‌గా సాయిపల్లవి?
Send us your feedback to audioarticles@vaarta.com
శర్వానంద్, సాయిపల్లవి జంటగా నటిస్తున్న సినిమా ‘పడి పడి లేచె మనసు’. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీసీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి, ప్రసాద్ చుక్కపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కలకత్తా నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథా చిత్రంలో సాయిపల్లవి డాక్టర్ పాత్రలో కనిపించనున్నట్లు ఆ మధ్య వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.
తాజా సమాచారం ప్రకారం.. ఫుట్ బాల్ ప్లేయర్‌గా ఆమె కనిపించనుందని తెలిసింది. మరి వీటిలో ఏది సరైన సమాచారమో త్వరలోనే తెలుస్తుంది. సునీల్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా విజయ దశమి కానుకగా అక్టోబర్ నెలలో విడుదల కానుందని సమాచారం. మురళీ శర్మ, సుహాసిని, ప్రియా రామన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి విశాల్ చంద్ర శేఖర్ సంగీతమందిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com