‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత డిస్ట్రిబ్యూటర్ షాకిచ్చాడా?
Send us your feedback to audioarticles@vaarta.com
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న చిత్రం ‘రౌద్రం రణం రుధిరం(ఆర్ఆర్ఆర్)’. దాదాపు 75 శాతం చిత్రీకరణ పూర్తయ్యింది. ఈ సినిమా కీలక షెడ్యూల్‌ను పూణేలో చిత్రీకరించాలని అనుకుంటున్న తరుణంలో లాక్‌డౌన్ కారణంగా షూటింగ్ ఆగిపోయింది. దాదాపు రెండు నెలలుగా ఈ సినిమాతో పాటు దేశంలోని అన్నీ సినిమాల షూటింగ్స్ ఆగిపోయాయి. ఇప్పుడు తెలుగు సినీ పెద్దలు సినిమాల షూటింగ్స్‌ను పునః ప్రారంభించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ప్రభుత్వం నుండి విధివిధానాలు రాగానే సినిమాలన్నీ సెట్స్ పైకి వెళతాయి. ఈలోపు జక్కన్న మాక్ షూటింగ్ చేస్తున్నాడు. ఇదంతా ఒకవైపు నడుస్తుంది.
అయితే మరో పక్క డిస్ట్రిబ్యూటర్స్ నుండి నిర్మాతకు ఒత్తిడిపెరుగుతుందట. ఎందుకంటే ఈ సినిమాను ఈ ఏడాది జూలై 30న విడుదల చేయాలని అనుకున్నారు. అయితే చివరకు వచ్చే ఏడాది జనవరి 8న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే చిత్రీకరణకు కరోనా అడ్డంకిగా మారింది. దీంతో చిత్రీకరణ మళ్లీ వెనక్కి వెళ్లింది. దీంతో విడుదల తేదీపై సందిగ్ధత నెలకొంది. ఈ కమ్రంలో యు.ఎస్. డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాత దానయ్యకు తామిచ్చిన అడ్వాన్స్‌ను వెనక్కివ్వమని చెబుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో నిజా నిజాలేంటో తెలియడం లేదు. కానీ ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ అన్నీ ఏరియాల్లో పూర్తయ్యింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com