ఆర్జీవీని అరెస్ట్ ఖాయమా?
Send us your feedback to audioarticles@vaarta.com
వివాదస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మను పోలీసులు అరెస్ట్ చేస్తారా? అవుననే సమాధానం సోషల్ మీడియాలో వినపడుతుంది. ఇంతకు ఆర్టీవీ అరెస్ట్ ఎందుకో తెలుసా? `అమ్మరాజ్యంలో కడపబిడ్డలు` సినిమా విషయంలో కె.ఎ.పాల్ వర్మపై పెట్టిన కేసు సంబంధంగా ఇప్పుడు పోలీసులు వర్మకు నోటీసులు జారీ చేశారు. ఈ సినిమాలో కె.ఎ.పాల్‌ను కామెడీ చూపించిన వర్మపై కె.ఎ.పాల్ సీరియస్ అయ్యాడు. అమెరికా నుండి వచ్చి కేసు వేశాడు. ఈయన కారణంగా ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా రెండు వారాల పాటు వాయిదా పడింది. సెన్సార్ విషయంలోనూ పెద్ద గొడవే జరిగింది. కోర్టు వాదనల తర్వాత చివరి నిమిషంలోనే సెన్సార్ సర్టిఫికేట్ వచ్చింది.
సెన్సార్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత వర్మ కె.ఎ.పాల్ తనకు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చినట్లు ఓ మార్ఫింగ్ ఫొటోను పోస్ట్ చేశారు. గతంలో ప్రణబ్ ముఖర్జీని కలిసిన ఫొటోను వర్మ పాల్ ఉన్నట్లుగా మార్ఫింగ్ చేశారు. దీనిపై సీరియస్ అయిన పాల్ మరోసారి వర్మపై కేసు నమోదు చేశారు. దీంతో పోలీసులు మరోసారి వర్మకు నోటీసులు పంపారు. మరి వర్మ దీనిపై ఎలా స్పందిస్తాడో తెలియడం లేదు. కానీ నోటీసులు ఇచ్చిన తర్వాత వర్మను పోలీసులు అరెస్ట్ చేస్తారా? లేదా? అనేది హాట్ టాపిక్‌గా మారింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com