మళ్లీ రిస్క్ చేస్తున్న రవితేజ ?
Send us your feedback to audioarticles@vaarta.com
సాధారణంగా ఒక జోనర్లో సినిమాలు చేసి.. అవి సక్సెస్ కానప్పుడు మన హీరోలు అలాంటి రిస్కులు చేయడానికి ఆలోచిస్తారు. కానీ రవితేజ అలాంటి ఆలోచనలేవీ లేకుండా ఓకే చెప్పాడని వార్తలు వినపడుతున్నాయి. అదేంటంటే రవితేజ గత చిత్ర డిస్కోరాజా మెయిన్ కథ రెట్రోలో ఉంటుంది. రివేంజ్ ఫార్ములాలో ఉండే సినిమా. కానీ.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. కానీ రవితేజ మరోసారి అలాంటి రిస్కే చేయబోతున్నాడని సినీ వర్గాల్లో వార్తలు వినపడుతున్నాయి.
వివరాల్లో కెళ్తే.. వరు సినిమాల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న మాస్ రాజా రవితేజ దర్శకుడు త్రినాథరావు నక్కిన డైరెక్షన్లో రవితేజ సినిమా చేయబోతున్నాడని వార్తలు వినపడుతున్నాయి. వివరాల మేరకు ‘హలో గురు ప్రేమ కోసమే’ సినిమా తర్వాత త్రినాథ రావు నక్కిన వెంకటేశ్‌తో సినిమా చేయాల్సింది. కానీ చివరి నిమిషంలో ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. తర్వాత త్రినాథరావు వేచి చూడక తప్పలేదు. ఇప్పుడు రవితేజ ఓకే చెప్పాడు. త్వరలోనే ఫైనల్ డిస్కషన్స్ అయిన తర్వాత ఓ సమాచారం వెలువడే అవకాశం ఉంది. లేటెస్ట్ సమాచారం మేరకు ఈ సినిమా కూడా 1980 బ్యాక్‌డ్రాప్‌లో సాగే రివేంజ్ డ్రామా అని వార్తలు వినపడుతున్నాయి. మరి ఇందులో నిజానిజాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై సినిమా రూపొందుతుందంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com