రీమేక్‌లో ర‌వితేజ‌?

  • IndiaGlitz, [Wednesday,April 15 2020]

ఈ మ‌ధ్య ర‌వితేజ జ‌యాప‌జ‌యాల‌కు సంబంధం లేకుండా వ‌రుస సినిమాల‌కు ఓకే చెప్పేస్తున్నాడు. వ‌రుస సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్నాడు. ఇప్పుడు ర‌వితేజ హీరోగా గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న క్రాక్ సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ సినిమా కాకుండా మ‌రో మూడు సినిమాల‌ను ర‌వితేజ లైన్‌లో పెట్టాడు. కాగా ఇప్పుడు ఓ రీమేక్‌లో ర‌వితేజ‌ను న‌టింప చేయాల‌ని నిర్మాత‌లు అనుకుంటున్నార‌ని టాక్. ఇంత‌కు ఆ సినిమా ఏదో కాదు.. మ‌ల‌యాళంలో విజ‌య‌వంతమైన ‘అయ్య‌ప్ప‌నుమ్ కోశియ‌మ్‌’. ఇద్ద‌రు హీరోలు చేయాల్సిన సినిమా ఇది. ఒక హీరోగా రానా ద‌గ్గుబాటి న‌టించడం దాదాపు ఖాయ‌మైంద‌నే చెప్పాలి.

అయితే మ‌రో హీరోగా ఎవ‌రు న‌టిస్తారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. రీసెంట్‌గా నంద‌మూరి బాల‌కృష్ణ పేరు ప్ర‌ముఖంగా విన‌ప‌డింది. అయితే బాల‌కృష్ణ ఇప్ప‌టికే క‌మిట్ అయిన సినిమాలు చేయాల్సి ఉండ‌టంతో నో చెప్పేశాడ‌ట‌. దీంతో నిర్మాత‌లు ర‌వితేజ‌ను ఒప్పించే ప్ర‌య‌త్నంలో ఉన్నార‌ని టాక్‌. మ‌రి ర‌వితేజ ఏమంటాడో చూడాలి. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నాయి. క‌రోనా ప్ర‌భావం త‌గ్గ‌గానే సినిమాకు సంబంధించిన వివ‌రాల‌ను ప్ర‌క‌టించే అవ‌కాశాలున్నాయి.