షూటింగ్ ఆపేసి అమెరికాకు రానా.. రూమర్స్ నిజామా?
Send us your feedback to audioarticles@vaarta.com
ఆరడుగుల ఆజానుబాహుడు రానా దగ్గుబాటి. నటనలో రానా పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకున్నాడు. బాహుబలి, ఘాజి, లీడర్ లాంటి వైవిధ్యమైన రోల్స్ తో రానా మెప్పించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా రెండేళ్ల క్రితం రానా ఆరోగ్యంపై అనేక రూమర్స్ వినిపించాయి.
రానాకు అమెరికాలో కీలకమైన సర్జరీ జరిగినట్లు వార్తలు వచ్చాయి. అది కిడ్నీకి సంబంధించిన చికిత్స అని, మరికొందరు లివర్ కి సంబంధించిన చికిత్స అంటూ ప్రచారం చేశారు. కానీ ఆ సమయంలో దగ్గుబాటి ఫ్యామిలీ ఎవరూ నోరు మెదపలేదు. అదే సమయంలో రానా బాగా వెయిట్ లాస్ కావడంతో రూమర్స్ ఇంకా బలపడ్డాయి.
కానీ ఇటీవల రానా బాగా ఆరోగ్యంగా కనిపించాడు. వరుసగా సినిమాలతో బిజీ అయ్యాడు. తాజాగా మరో రూమర్ వైరల్ అవుతోంది. రానా ప్రస్తుతం నటిస్తున్న అయ్యప్పన్ కోషియం చిత్ర షూటింగ్ ఆపేసి సడన్ గా ట్రీట్ మెంట్ కోసం అమెరికా వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలంటే దగ్గుబాటి కాంపౌండ్ రెస్పాండ్ కావాల్సిందే.
రానా దగ్గుబాటి వారసత్వం నుంచి వచ్చినప్పటికీ నటుడిగా సొంతం ఇమేజ్ సంపాదించాడు. విలక్షణ నటనతో ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం రానా వేణు ఊడుగుల దర్శకత్వంలో నటించిన విరాటపర్వం చిత్రం రిలీజ్ కు రెడీగా ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ తో కలసి నటిస్తున్న అయ్యప్పన్ కోషియం రీమేక్ సంక్రాంతికి రిలీజ్ కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments