రామ్‌చ‌ర‌ణ్ నెక్ట్స్ ఖ‌రారైందా?

  • IndiaGlitz, [Monday,February 24 2020]

ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ క‌థానాయ‌కులుగా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఈ వేస‌వికి చిత్రీక‌ర‌ణ ముగుస్తుంది. దీంతో ఈ ఇద్ద‌రు హీరోలు వారి త‌దుప‌రి సినిమాల‌ను ట్రాక్ ఎక్కించ‌డానికి స‌న్న‌ద్థ‌మవుతున్నారు. ఇందులో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఇప్ప‌టికే త‌న సినిమాను త్రివిక్ర‌మ్‌తో చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. ఇక రామ్‌చ‌ర‌ణ్ విష‌యానికి వ‌స్తే.. ఏ ద‌ర్శ‌కుడితో చెర్రీ సినిమా చేస్తాడ‌నే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. మెగా ప‌వ‌ర్ ద‌ర్శ‌కుల ద‌గ్గ‌ర క‌థ‌లు మాత్రం ఏక‌ధాటిగానే వింటున్నాడు. కానీ ఏ విష‌యం క్లారిటీ రాలేద‌ని వార్త‌లు విన‌ప‌డుతూ వ‌చ్చాయి. అయితే తాజాగా రామ్‌చ‌ర‌ణ్ నెక్ట్స్ మూవీపై నిర్ణ‌యం తీసుకున్నాడ‌ని టాక్‌.

వివ‌రాల్లోకెళ్తే.. 13బి, మ‌నం చిత్రాల ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కె.కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్క‌నుంద‌నేది టాక్‌. రీసెంట్‌గా విక్ర‌మ్ చెప్పిన క‌థ‌ను చ‌ర‌ణ్ ఓకే చెప్పాడని అంటున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించ‌నుంద‌నేది టాక్‌. త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంద‌ట‌. ఈ చిత్రానికి అనిరుధ్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందిస్తాడ‌ట‌. హ‌లో, గ్యాంగ్ లీడ‌ర్ సినిమాలు ప్లాప్ అయిన త‌రుణంలో విక్ర‌మ్ కె.కుమార్‌పై న‌మ్మకంతో చ‌ర‌ణ్ సినిమా చేయ‌డ‌మ‌నేది గొప్ప విష‌య‌మే. మ‌రి గ‌త రెండు సినిమాలు ప్లాపులుగా మారిన.. ఈసారైనా విక్ర‌మ్ కుమార్ త‌న‌ను తాను ప్రూవ్ చేసుకుంటాడో లేదోన‌ని చూడాలి.