రామ్ ఆ డైరెక్ట‌ర్‌కి ఓకే చెబుతాడా?

  • IndiaGlitz, [Saturday,March 07 2020]

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ ప్ర‌స్తుతం ‘రెడ్’ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నాడు. ఇది పూర్తి కాగానే రామ్ ఏ సినిమా చేస్తాడ‌నే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు కానీ.. తాజా స‌మాచారం మేర‌కు డైరెక్ట‌ర్ మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రామ్ సినిమా చేయ‌బోతున్నాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. గ‌త ఏడాది చివ‌రలో ‘ప్ర‌తిరోజూ పండ‌గే’ సినిమాతో హిట్ కొట్టిన ద‌ర్శ‌కుడు మారుతి ఇప్పుడు కొత్త స్క్రిప్ట్‌ను త‌యారు చేస్తున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం రామ్‌తో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని టాక్‌. అంతా ఓకే అయితే యువీ క్రియేష‌న్స్‌, జీఏ2 పిక్చ‌ర్స్ ప‌తాకాల‌పై సినిమా తెర‌కెక్కే అవ‌కాశం ఉంది.

‘ఇస్మార్ట్ శంక‌ర్‌’తో భారీ హిట్ కొట్టిన రామ్ స్రవంతి మూవీస్ బ్యానర్‌పై స్ర‌వంతి ర‌వికిషోర్ నిర్మాత‌గా కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో ‘రెడ్‌’ సినిమా తెర‌కెక్కుతోంది. ఈ సినిమా చివ‌రి పాట చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. మ‌రో ప‌క్క పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు కూడా పూర్త‌వుతున్నాయి. ఏప్రిల్ 9న సినిమాను విడుద‌ల చేస్తున్నారు. త‌మిళ చిత్రం ‘త‌డ‌మ్‌’కు రీమేక్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు నాని, శ‌ర్వానంద్, సాయిధ‌ర‌మ్ తేజ్ వంటి యువ హీరోల‌ను డైరెక్ట్ చేసి హిట్స్ కొట్టిన మారుతి క‌థ‌కు రామ్ ఓకే చెబుతాడో లేదో తెలియాలంటే మ‌రికొన్ని రోజులు ఆగాల్సిందే..