మెగాస్టార్ రాక.. రకుల్ అలక
Send us your feedback to audioarticles@vaarta.com
సినీ ప్రొడక్షన్ మేనేజర్స్ యూనియన్ సిల్వర్ జూబ్లీ ఈవెంట్ ఆదివారం రాత్రి చాలా ఘనంగా జరిగింది. ఈ వేడుకకి సినీ రంగానికి చెందిన అతిరథ మహారథులు హాజరయ్యారు. ప్రొడక్షన్ యూనియన్‌కు తమ అభినందనలను తెలియజేశారు. స్టార్ హీరోయిన్స్ పెర్ఫామెన్స్లు ప్రోగ్రామ్‌కు హైలైట్‌గా నిలిచాయి. పూజాహెగ్డే, క్యాథరిన్, లావణ్య త్రిపాఠి, అనసూయ, రుక్సర్ థిల్లాన్, శివానీ, శివాత్మిక ఇలా పలువురు తారలు డ్యాన్స్ ప్రోగ్రామ్స్‌తో మెప్పించారు. రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్‌తో కలిసి రాశీఖన్నా పాటలు పాడి అలరించింది. ఇక్కడ ప్రస్తావించాల్సిన విషయమేమంటే.. ఈ ప్రోగ్రామ్‌కు రకుల్ కూడా వచ్చింది. కానీ ఆమె ఎలాంటి పెర్ఫామెన్స్ చేయలేదు. అందుకు కారణం జెమినీ టీవీ డైరెక్టర్ సంజయ్ పై అలగడమేనని వార్తలు వినపడుతున్నాయి.
నిజానికి రకుల్ ప్రీత్ సింగ్ డ్యాన్సింగ్ నెంబర్ ప్రదర్శించాల్సిన సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి ఆడిటోరియంలోకి ప్రవేశించారు. దీంతో అందరిలో హాడావుడి కనపడింది. అదే సమయంలో మహేశ్ కూడా అక్కడే ఉండటం చిరు, మహేశ్‌లు ప్రత్యేకంగా ముచ్చటించుకోవడం వంటివి జరిగాయి. దీంతో అందరి దృష్టి వారిపైనే నిలిచిపోవడంతో రకుల్ డ్యాన్స్ ప్రోగామ్ డిలే అయ్యింది. ఇక వెయిట్ చేయడం ఇష్టం లేక రకుల్ కోపంతో ప్రోగ్రామ్ మధ్యలోనే వెళ్లిపోయిందని అందరూ అంటున్నారు. ఈవెంట్ మేనేజమెంట్ పక్కా ప్లానింగ్‌లో ఉండకపోవడం వల్లనే సమస్యలు వచ్చాయని కొందరు అంటుంటే.. అంత భారీ ఎత్తున జరిగే ప్రోగామ్లో చిన్న చితకా లోటు పాట్లు ఉండం కామనే. అలాంటి సమయంలోనే సర్దుకుపోవాలి. అంతే తప్ప అలిగితే ఎలా? అని మరికొందరు అంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments