#RRR లో విల‌న్‌గా రాజశేఖర్?

  • IndiaGlitz, [Wednesday,March 28 2018]

నిన్నటి తరం కథానాయకుల్లో కొంతమంది.. ప్రతినాయక ఛాయలున్న పాత్రల వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఈ కోవలో ఇప్పటికే తనని తాను ప్రూవ్ చేసుకున్న నటుడు జగపతి బాబు. సెకండ్ ఇన్నింగ్స్‌లో విలన్‌గా ఎంట్రీ ఇచ్చి ఏ పాత్ర చేయడానికైనా సిద్ధం అన్నట్టు చెప్పకనే చెప్పారు. ఇక ఇదే బాటలో నటుడు శ్రీకాంత్ కూడా నడుస్తున్నారు. అలాగే.. “విలన్ పాత్ర చేయడానికైనా రెడీ” అని రాజశేఖర్ గతంలోనే హింట్ ఇచ్చేసారు. ఇప్పుడు ఆ హింట్‌ను పూర్తిగా వాడుకోవడానికి రాజమౌళి సిద్ధపడిపోయారని సమాచారం.

ఆ వివరాల్లోకి వెళితే.. రాజమౌళి.. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో ఓ మల్టీస్టారర్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీపై #RRR (రాజమౌళి, రామారావు, రామ్ చరణ్)అంటూ రాజమౌళి ప్రకటన కూడా చేసారు. ఇప్పుడు ఈ సినిమా విషయమై రాజమౌళి ప్రతినాయక పాత్ర కోసం రాజశేఖర్‌ను సంప్రదించారట. రాజశేఖర్ కూడా ఈ పాత్ర చేయడానికి సిద్ధం అన్నట్టుగా తెలుస్తోంది. అధికారికంగా రాజశేఖర్ నటించడం ఖాయమైతే మరో #R కూడా వచ్చి చేరుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. అక్టోబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది (2019) వేసవిలో విడుదల కానుంది.

More News

నిర్మాత‌గా మారుతున్న బాబీ...

'ప‌వ‌ర్‌', 'స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్‌', 'జై ల‌వ‌కుశ' చిత్రాల‌తో డైరెక్ట‌ర్‌గా త‌న స్టామినాను ప్రూవ్ చేసుకున్న ద‌ర్శ‌కుడు కె.ఎస్‌.ర‌వీంద్ర (బాబి).

సైరాలో అమితాబ్ లుక్ ఎలా ఉంటుందంటే...

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’.

డైరెక్ష‌న్ ఆలోచ‌నలో యంగ్ హీరో....

అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు, మెంట‌ల్ మ‌దిలో, నీది నాది ఒకే క‌థ సినిమాల్లో న‌టించిన త‌న‌కంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న న‌టుడు శ్రీవిష్ణు.

వెబ్ సిరీస్‌లో అమీర్ ఖాన్‌...

ప‌లు వివాదాల‌కు కేంద్ర బిందువుగా నిలిచిన ఓషో 1990లో క‌న్నుమూశారు.

సీనియ‌ర్ న‌టి జ‌యంతికి తీవ్ర అస్వ‌స్థ‌త‌

ద‌క్షిణాది  తెర‌పై త‌న‌దైన న‌ట‌న‌తో మెప్పించిన న‌టీమ‌ణి జ‌యంతి.. తీవ్ర అస్వ‌స్థ‌త‌కు లోన‌య్యారు. ప్ర‌స్తుతం వ‌య‌సు మీద‌ప‌డ‌టంతో జ‌యంతి బెంగుళూరులో ఉంటున్నారు.