రజనీ సినిమాలో రాహుల్ నటిస్తాడా.. పాడేస్తాడా!?
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్-3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్‌కు ఈ మధ్య వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇదివరకు బిగ్‌బాస్ విన్నర్‌గా నిలిచిన వారికంటే.. రాహుల్‌కు లక్కీ చాన్స్‌లు వచ్చేస్తున్నాయ్. ఇటు సింగర్ అటు నటుడిగా మల్టీ టాలెంట్ ఉండటంతో అవకాశాలు మాత్రం కొదువ లేకుండా వస్తున్నాయి. వాస్తవానికి పునర్నవీ భూపాలంతో కలిసి సినిమా చేయాలనుందని హీరోగా నటిస్తానని అప్పుడెప్పుడో తన మనసులో మాటను చెప్పాడు. అయితే సినిమా తీయడానికి ఎవరూ ముందుకు రాలేదు కానీ.. సినిమాల్లో మాత్రం అవకాశం పిలిచి మరీ ఇస్తున్నారు.
మరాఠీ సినిమా ‘నటసామ్రాట్’కు రీమేక్‌గా రూపొందుతున్న ‘రంగమార్తాండ’ సినిమాలో ఓ పాత్రలో రాహుల్ నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటన కూడా వచ్చింది. అంతేకాదు.. ప్రకాష్ రాజు కుమార్తెగా.. రాహుల్ సిప్లిగంజ్ జోడీగా యాంగ్రీ హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక నటిస్తోందని కూడా అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయ్. ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్ - రమ్యకృష్ణ ప్రధానమైన పాత్రలను పోషిస్తుండగా, బ్రహ్మానందం కీలకమైన పాత్రలో కనిపించనున్నారు.
అయితే తాజాగా సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమాలో నటించే అవకాశం కొట్టేశాడని తెలుస్తోంది. వాస్తవానికి రజనీకాంత్, మీనా, ఖుష్బూ నటీనటులుగా శివ దర్శకత్వంలో ఓ సినిమా త్వరలో తెరకెక్కనుంది. అయితే.. రజనీతో రాహుల్ ఫొటో దిగడంతో.. ఆయన తదుపరి సినిమాలో నటిస్తున్నారని కొందరు.. అదేం కాదు సింగర్‌గా మాత్రమేనని ఇంకొందరు.. అబ్బే ఫొటో దిగాడంతో దీనికే ఇంత హడావుడా అని మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ రజనీ సినిమాలో రాహుల్ నటిస్తాడా..? లేకుంటే పాడేస్తాడా..? అనేది తెలియాలంటే మరికొన్నిరోజులు వేచి చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com