‘ఆదిపురుష్’ను ‘రాధేశ్యామ్’ ఫాలో అవుతున్నాడా?
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రభాస్ రూటు మార్చాడు. అభిమానులకు షాకుల మీద షాకులు ఇస్తున్నాడు. అవన్నీ స్వీట్ షాకులే అనుకోండి. దాంతో ఫ్యాన్స్ హార్ట్ బీట్ రోజు రోజుకు పెరుగుతోంది. ఇంతకు ముందు ప్రభాస్ కొత్త సినిమా నుంచి కొత్త కబురు ఎప్పుడొస్తుందా? ఎప్పుడొస్తుందా? అని అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసేవారు. ‘రాధే శ్యామ్’ అప్డేట్స్ ఇవ్వడం లేదని ప్రభాస్ సన్నిహితులకు చెందిన నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ మీద ట్విట్టర్లో మండిపడ్డారు. ఇప్పుడు సీన్ రివర్స్ గేరులోకి వచ్చింది.
ఒక అప్డేట్ తర్వాత మరొకటి, మరో అప్డేట్ తర్వాత ఇంకొకటి... వరుస పెట్టి ప్రభాస్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ వస్తున్నాయి. దాంతో అభిమానులు ఫుల్ హ్యాపీ. ‘ఫలానా రోజున అప్డేట్ ఇస్తాం’, ‘అప్పుడు ఫస్ట్ లుక్ విడుదల చేస్తాం’ అని అభిమానులను ప్రభాస్ ఊరించడం లేదు. ఒక్క ముక్క కూడా చెప్పడం లేదు. సడన్‌గా ఎర్లీ మార్నింగ్ కొత్త న్యూస్ చెప్తున్నాడు. ‘ఆదిపురుష్’ అప్డేట్స్ అన్నీ ఎర్లీ మార్నింగ్స్ వచ్చాయి. ‘రాధేశ్యామ్’ ప్రీ–టీజర్‌ను కూడా ఎర్లీ మార్నింగ్ రిలీజ్ చేశారు. ప్రీ టీజర్ రిలీజ్ చేస్తున్నట్టు ముందుగా చెప్పలేదు. సడన్‌గా రిలీజ్ అయ్యేసరికీ ఫ్యాన్స్‌కి స్వీట్ షాక్ తగిలింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments