‘ఆదిపురుష్‌’ను ‘రాధేశ్యామ్‌’ ఫాలో అవుతున్నాడా?

  • IndiaGlitz, [Sunday,February 07 2021]

ప్రభాస్‌ రూటు మార్చాడు. అభిమానులకు షాకుల మీద షాకులు ఇస్తున్నాడు. అవన్నీ స్వీట్‌ షాకులే అనుకోండి. దాంతో ఫ్యాన్స్‌ హార్ట్‌ బీట్‌ రోజు రోజుకు పెరుగుతోంది. ఇంతకు ముందు ప్రభాస్‌ కొత్త సినిమా నుంచి కొత్త కబురు ఎప్పుడొస్తుందా? ఎప్పుడొస్తుందా? అని అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసేవారు. ‘రాధే శ్యామ్‌’ అప్‌డేట్స్‌ ఇవ్వడం లేదని ప్రభాస్‌ సన్నిహితులకు చెందిన నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్‌ మీద ట్విట్టర్‌లో మండిపడ్డారు. ఇప్పుడు సీన్‌ రివర్స్‌ గేరులోకి వచ్చింది. 

ఒక అప్‌డేట్‌ తర్వాత మరొకటి, మరో అప్‌డేట్‌ తర్వాత ఇంకొకటి... వరుస పెట్టి ప్రభాస్‌ సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ వస్తున్నాయి. దాంతో అభిమానులు ఫుల్‌ హ్యాపీ. ‘ఫలానా రోజున అప్‌డేట్‌ ఇస్తాం’, ‘అప్పుడు ఫస్ట్‌ లుక్‌ విడుదల చేస్తాం’ అని అభిమానులను ప్రభాస్‌ ఊరించడం లేదు. ఒక్క ముక్క కూడా చెప్పడం లేదు. సడన్‌గా ఎర్లీ మార్నింగ్‌ కొత్త న్యూస్‌ చెప్తున్నాడు. ‘ఆదిపురుష్‌’ అప్‌డేట్స్‌ అన్నీ ఎర్లీ మార్నింగ్స్‌ వచ్చాయి. ‘రాధేశ్యామ్‌’ ప్రీ–టీజర్‌ను కూడా ఎర్లీ మార్నింగ్‌ రిలీజ్‌ చేశారు. ప్రీ టీజర్‌ రిలీజ్‌ చేస్తున్నట్టు ముందుగా చెప్పలేదు. సడన్‌గా రిలీజ్‌ అయ్యేసరికీ ఫ్యాన్స్‌కి స్వీట్‌ షాక్‌ తగిలింది.

More News

ఫిబ్రవరి నెలాఖరున సత్తారు సెట్‌కి కింగ్‌

‘గరుడవేగ’ సినిమాతో దర్శకుడిగా ప్రవీణ్‌ సత్తారు సత్తా ఏమిటో ఇండస్ట్రీకి తెలిసింది. సెన్సిబుల్‌ సినిమా ‘చందమామ కథలు’ తీసిన వ్యక్తిలో ఇంత విషయం ఉందా?

ఎడారిలో మహేష్‌ కుమార్తె సితార

ఎడారిలో సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు కుమార్తె సితార ఎంజాయ్‌ చేసింది. ఒంటెలు, బైకులు, డన్‌ బగ్గీస్‌లో షికార్లు చేసింది.

పవన్ పేరులో కిక్కే వేరప్పా... అదో మాదిరి ఉప్పెన!

'కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు' - 'గబ్బర్ సింగ్'లో డైలాగ్. విలన్ ఇంటికి పవన్ కటౌట్‌తో బ్రహ్మానందం వెళ్లే సీన్‌కి థియేటర్లలో విజిల్స్ పడ్డాయి.

ప్రేక్ష‌కుల‌కు కావాల్సిన ఎంట‌ర్‌టైన‌ర్ ఈ సంవ‌త్స‌రం ఇంకా రాలేదు..ఈ సినిమా ఆ ఎంట‌ర్‌టైన‌ర్ కాబోతోంది - జ‌గ‌ప‌తిబాబు

జ‌గ‌ప‌తిబాబు ప్ర‌ధాన పాత్ర‌ధారిగా, రామ్ కార్తీక్‌-అమ్ము అభిరామి యువ జంట‌గా, మ‌రో కీల‌క పాత్ర‌లో బేబి స‌హ‌శ్రిత న‌టించిన 'ఎఫ్‌సీయూకే (ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్‌)'

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై స్పందించిన జగన్.. మోదీకి లేఖ

ఏపీని కుదుపేస్తున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అంశంపై ఎట్టకేలకు సీఎం జగన్ స్పందించారు. ఈ విషయమై ప్రధాని మోదీకి జగన్ లేఖ రాశారు.