పూరి స్క్రిప్ట్ చేంజ‌స్ చేస్తున్నాడా?

పూరి కొన్ని విష‌యాల్లో చాలా నిక్క‌చ్చిగా ఉంటాడు. ఒక‌సారి స్క్రిప్ట్ లాక్ అయిన త‌ర్వాత మార్పులంటే ఎవ‌రు చెప్పినా విన‌డు. అందుకు ఉదాహ‌ర‌ణ లోఫ‌ర్ సినిమా టైటిల్‌ను మార్చాల‌ని నిర్మాత చెప్పినా ఆయ‌న టైటిల్ మార్చ‌డానికి ఇష్ట‌ప‌డ‌లేదు. అలాంటి వ్య‌క్తికి ఇప్పుడు క‌రోనా పెద్ద స‌మ‌స్య‌ను క్రియేట్ చేసింద‌ని, క‌రోనా ఎఫెక్ట్‌తో పూరి త‌న స్క్రిప్ట్‌లో మార్పులు, చేర్పులు చేసుకుంటున్నాడ‌ని టాక్‌.

వివరాల్లోకెళ్తే పూరి జ‌గ‌న్నాథ్, విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబినేష‌న్‌లో ఓ సినిమా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతోన్న ఈ చిత్ర నిర్మాణంలో క‌ర‌ణ్ జోహార్ కూడా భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ముంబైలో కొంత మేర‌కు చిత్రీక‌ర‌ణ కూడా జ‌రిగింది. అయితే క‌రోనా ప్ర‌భావం ఎక్కువ కావ‌డంతో లాక్‌డౌన్ విధించారు. షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయి. ఆ నేప‌థ్యంలో పూరి సినిమా కూడా ఆగింది. ఇప్పుడిప్పుడే అంద‌రూ సినిమాల‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లాల‌నుకుంటున్నారు. అయితే విదేశీ న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌తో ప్లాన్ చేసుకున్న షెడ్యూల్స్‌, ఫారిన్ షెడ్యూల్స్‌ను అనుకున్న‌ట్లుగా చిత్రీక‌రించ‌లేక‌పోతున్నారు. ఆ క‌మ్రంలో పూరి, విజ‌య్ సినిమాలో కొంద‌రు విదేశీ ఫైట‌ర్స్ వ‌ర్క్ చేయాల్సి ఉంది. అలాగే విదేశాల్లో పూరి ఓ షెడ్యూల్‌ను కూడా ప్లాన్ చేశాట్ట‌. అయితే ప్ర‌స్తుతం నెల‌కొన్న ప‌రిస్థితుల కార‌ణంగా పూరి మార్పులు చేయ‌క త‌ప్ప‌డం లేదని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. మ‌రి ఇందులో నిజా నిజాలు తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే!.