ఇక హీరోగా ప్రదీప్ కెరీర్ ముగిసినట్టేనా?
Send us your feedback to audioarticles@vaarta.com
యాంకర్స్ అనగానే ప్రస్తుత పరిస్థితుల్లో గుర్తొచ్చే పేర్లు ఫిమేల్ అయితే సుమ.. మేల్ అయితే ప్రదీప్. ఈ ఇద్దరూ తెలుగు ప్రేక్షకులు అమితంగా ఇష్టపడే యాంకర్లు. ప్రదీప్ విషయానికి వస్తే యాంకరింగ్ కా బాప్ అనిపిస్తాడు. అద్భుతమైన యాంకర్‌తో ప్రేక్షకులను టీవీ ముందు కట్టిపడేస్తాడు. అందుకే ప్రదీప్‌పై ఎన్ని రూమర్లు వచ్చినా.. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడినా.. ఆయనకున్న క్రేజ్ మాత్రం తగ్గలేదు. అదే మరో యాంకర్ అయి ఉంటే.. కెరీర్‌కు అంతటితో ఫుల్ స్టాప్ పడేది కానీ ప్రదీప్‌పై ఎన్నో ట్రోల్స్ వచ్చినా ఆయన కెరీర్‌ను మాత్రం అడ్డుకోలేకపోయాయి. అటువంటి ప్రదీప్ రెండోసారి రాంగ్ స్టెప్ వేశాడు.
రెండోసారా? అని ఆశ్చర్యపోకండి. మొదటి సారి ‘పెళ్లిచూపులు’ పేరుతో ఒక వినూత్న కార్యక్రమానికి తెరదీశాడు. అందమైన అమ్మాయిలతో షో చేశాడు. ఇది ఎంత మాత్రమూ ప్రదీప్‌కు ఉపయోగపడలేదు సరికదా... చర్చలు పెట్టి ఏకిపారేశారు. మరోవైపు నెటిజన్లు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ దీనిపై దుమ్మెత్తి పోశారు. ఈ షో దారుణమైన రేటింగ్‌తో ఊహించని నష్టాలతో తుది అంకానికి చేరకుండానే ఆగిపోయింది. దీంతో టెలివిజన్‌లో ప్రయోగాలకు తెరదించేసి.. తిరిగి ప్రదీప్ యాంకరింగ్‌పై దృష్టి పెట్టాడు. మళ్లీ యాంకర్‌గా మంచి ఫామ్‌లోకి వచ్చాడు. అప్రతిహత హవాను కొనసాగిస్తుండగానే మరో రాంగ్ స్టెప్ వేశాడు. అదేంటంటే హీరోగా వెండితెరపై ఎంట్రీ ఇవ్వడం.
అడపాదడపా క్యారెక్టర్ ఆర్టిస్టుగా వెండితెరపై కనిపించినప్పటికీ ఎప్పుడూ ట్రోల్స్ మాత్రం రాలేదు. పర్వాలేదనే అనిపించాడు. కానీ హీరోగా చేయాలని డెసిషన్ తీసుకునే రాంగ్ స్టెప్ వేశాడు. ప్రదీప్ హీరోగా తెరకెక్కిన ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాలోని ‘నీలి నీలి ఆకాశం’ సాంగ్ విడుదలై ఊహించని విధంగా పాపులర్ అయ్యింది. దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. సినిమా ఓ రేంజ్లో ఉంటుందని భావించి థియేటర్‌కి వెళ్లిన ప్రేక్షకుడిని దారుణంగా నిరాశపరిచింది. ఈ సినిమా దారుణమైన మౌత్ టాక్‌ను సంపాదించుకుంది. ఇక రేటింగ్ సరేసరి. బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. దాదాపు 11 నెలల పాటు థియేటర్లు ఎప్పుడు తెరుస్తారా? అని వేచి చూసిన ప్రేక్షకులు సైతం ఈ సినిమా ఆడుతున్న థియేటర్ వైపు చూసేందుకు సాహసించలేదు. దీంతో ప్రేక్షకుల నుంచి ప్రదీప్‌కు సలహాలు, సూచనలు మాత్రం భారీగానే అందుతున్నాయని టాక్. దయచేసి మరోసారి హీరోగా చేయవద్దని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కోరుతున్నారు. ఈ సినిమా చూసిన తర్వాత ప్రదీప్‌తో చేసేందుకు ఏ నిర్మాత కూడా సాహసించరనేది టాలీవుడ్ టాక్. మొత్తమ్మీద 30 రోజుల మాటేమో కానీ ఒక్కరోజులో ప్రదీప్ హీరో కెరీర్ ముగిసిపోయిందని ప్రేక్షకులు భావిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments