ప్రభాస్ అభిమానులకు దూరమవుతున్నాడా?
Send us your feedback to audioarticles@vaarta.com
హీరోల్లో ప్రభాస్‌కు ఒక ప్రత్యేక స్థానముంది. కానీ ఈ మధ్య కాలంలో ఆయనను అభిమానులు బాగా మిస్ అవుతున్నారు. మిగిలిన హీరోలంతా ఒక ఏడాదిలోపు మాత్రమే పూర్తయ్యే సినిమాలకు కమిట్ అయిపోయి.. వెంట వెంటనే తమ సినిమాలను రిలీజ్ చేసుకుంటూ మంచి సక్సెస్‌ను సొంతం చేసుకుంటున్నారు. అయితే ప్రభాస్ మాత్రం భారీ ప్రాజెక్టులకు కమిట్ అవుతూ క్రమక్రమంగా అభిమానులకు దూరమవుతున్నాడనే టాక్ సర్వత్రా వినిపిస్తోంది. ‘బాహుబలి’తో నేషనల్ స్టార్‌డమ్‌ను సంపాదించుకున్న యంగ్ రెబల్ స్టార్.. సొంత గడ్డపై మాత్రం కరుమగువుతున్నాడేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ‘బాహుబలి’ కోసం తన ఐదేళ్ల సమయాన్ని వెచ్చించాడు. ఆ టైమ్‌లో రానా అయినా ‘నేనే రాజు.. నేనే మంత్రి’ చేశాడు కానీ ప్రభాస్ మాత్రం పూర్తిగా ‘బాహుబలి’కే కమిట్ అయిపోయి ఉన్నాడు.
ఆ తరువాతైనా చిన్న ప్రాజెక్టును ఎంచుకున్నాడా? అంటే అదీ లేదు. ‘సాహో’ సినిమా కోసం రెండేళ్లు దాదాపుగా కనుమరుగై పోయాడు. ఈ సినిమా అంతగా ప్రేక్షకులను మెప్పించలేక పోయింది. ఈ ఏడాది సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశమే లేదు. దీంతో ఈ ఏడాది కూడా ప్రభాస్ కనిపించడు. అసలు ఒకసారి ఆయన సినిమాల పరంపరను చూస్తే.. 2013లో ‘మిర్చి’లో కనిపించాడు. 2015లో ‘బాహుబలి 1’.. 2017లో ‘బాహుబలి 2’.. 2019లో ‘సాహో’.. ఇక 2021 వరకూ నెక్ట్స్ సినిమా విడుదలయ్యే అవకాశమే లేదు. ఆయన చేస్తున్న ‘రాధేశ్యామ్’ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ అవుతుంది. దీంతో ప్రభాస్ సక్సెస్‌ల మాటేమో కానీ.. అభిమానుల నుంచి మాత్రం క్రమక్రమంగా దూరమవుతున్నాడనే టాక్ మాత్రం బలంగా వినిపిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com