నితిన్‌కు నో చెప్పిన పూజా హెగ్డే..?
Send us your feedback to audioarticles@vaarta.com
యువ కథానాయకుడు నితిన్.. ఏడాదిన్నర గ్యాప్ తర్వాత చేసిన `భీష్మ`తో బాక్సాఫీస్ దగ్గర పెద్ద హిట్ కొట్టాడు. ఇప్పుడు ‘రంగ్ దే’ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు నితిన్. దీని తర్వాత బాలీవుడ్లో ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే, టబు నటించిన `అంధాదున్` సినిమాను తెలుగులో నితిన్ రీమేక్ చేస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ రీమేక్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో రోజుకొక వార్త చక్కర్లు కొడుతూనే ఉంది. రీసెంట్గా బాలీవుడ్లో టబు చేసిన పాత్రను ఎవరితో చేయిస్తారనే దానిపై పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే హీరోయిన్గా ఎవరు నటిస్తారనే దానిపై సోషల్ మీడియాలో ఆసక్తికరమైన వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
నితిన్ సరసన ప్రియాంక అరుల్ మోహన్, నభా నటేశ్ వంటి పేర్లు వినిపించాయి. ఈ సినిమా హీరోయిన్‌కు సంబంధించి ఆసక్తికరమైన వార్తొకటి నెట్టింట షికార్లు చేస్తుంది. అదేంటంటే.. యూనిట్ వర్గాలు పూజా హెగ్డేను హీరోయిన్గా నటించమని సంప్రదించారట. అయితే వరుస సినిమాలతో బిజీగాఉన్న పూజా హెగ్డే డేట్స్ అడ్జస్ట్ చేయలేనని చెప్పేసిందని అంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com