పవన్, రవితేజ మల్టీస్టారర్.. రీమేకా?
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్, మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్‌లో ఓ భారీ మల్టీస్టారర్ రూపొందనుందనే వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. పవర్, సర్దార్ గబ్బర్ సింగ్, వెంకీమామ చిత్రాల దర్శకుడు బాబీ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నాడని టాక్. నిన్న మొన్నటి వరకు ఈ న్యూస్ తెగ హల్ చేసింది. తాజాగా మరో న్యూస్ దీనికి జత కలిసింది. అదేంటంటే..
2017లో తమిళంలో విడుదలైన విక్రమ్ వేద సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నారని, అందులోనే పవన్‌కల్యాణ్, రవితేజ నటించబోతున్నారని టాక్. విజయ్ సేతుపతి, మాధవన్ కలిసి నటించిన విక్రమ్ వేద తమిళంలో భారీ విజయాన్ని సాధించింది. దీన్ని తెలుగులో రీమేక్ చేయాలనే ప్రయత్నాలు అప్పట్లో బలంగానే జరిగాయి. కానీ.. ఎందుకనో మెటీరియలైజ్ కాలేదు. ఇప్పుడు మరోసారి విక్రమ్ వేద రీమేక్ తెరపైకి వచ్చింది. పవన్, రవితేజలకు సన్నిహితుడైన నిర్మాత రామ్ తాళ్లూరి ఈ సినిమాను నిర్మించడానికి ఆసక్తి చూపుతున్నారని సమాచారం.
ఓ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌కి, గ్యాంగ్‌స్టర్‌కి మధ్య జరిగే టామ్ అండ్ జెర్రీ ఫైట్‌లాంటి కథాంశంతో రూపొందిన చిత్రమిది. మరి అంతా ఓకే అయితే విజయ్ సేతుపతి పోషించిన గ్యాంగ్ స్టర్ పాత్రలో పవన్‌కల్యాణ్, మాధవన్ పోషించిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో రవితేజ నటిస్తారంటున్నారు. మరి ఇందులో నిజా నిజాలు తెలియాలంటే వేచి చూడాల్సిందే...
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments