వరుణ్ సినిమానే పవన్ చేస్తున్నారా..?
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా హీరో వరుణ్‌తేజ్ చేయాల్సిన సినిమాను ఆయన బాబాయ్, పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ చేస్తున్నాడు. ఇంతకీ అలా పవర్‌స్టార్ చేస్తున్న సినిమా ఏదో తెలుసా!.. ‘హరిహర వీరమల్లు’. క్రిష్ దర్శక నిర్మాణంలో వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన చిత్రం ‘కంచె’. ఈ సినిమా తర్వాత మరోసారి వరుణ్‌తేజ్‌తో సినిమా చేయడానికి క్రిష్ తయారు చేసుకున్న కథే ఈ ‘హరిహర వీరమల్లు’. అయితే బడ్జెట్ పరిమితులు దాటుతుండటంతో వరుణ్‌తో సినిమా చేయలేకపోయాడు. ఇప్పుడు అదే కథ పవన్‌కు నచ్చడంతో సినిమా ట్రాక్ ఎక్కింది. మధ్యలో వరుణ్‌తేజ్‌తో క్రిష్ ఓ స్పై థ్రిల్లర్ చేయాలని అనుకున్నప్పటికీ ఎందుకనో ఆ సినిమా మెటీరియలైజ్ కాలేదు.
ప్రస్తుతం పవన్, క్రిష్ కాంబినేషన్లో రూపొందుతోన్న ‘హరిహర వీరమల్లు’ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా భారీ ఎత్తున విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా కోసం వేసిన భారీ సెట్స్‌లో షూటింగ్ చకచకా జరుగుతోంది. మొఘల్ కాలం నేపథ్యంలో సినిమా తెరకెక్కుతుంది. బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ ఇందులో ఔరంగజేబు పాత్రలో నటిస్తే.. జాక్వలైన్ ఫెర్నాండెజ్, నిధి అగర్వాల్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments