ప్లాప్ డైరెక్ట‌ర్‌తో నితిన్‌...నిజ‌మెంత‌?

  • IndiaGlitz, [Saturday,February 15 2020]

యువ క‌థానాయ‌కుడు నితిన్ ఇప్పుడు వ‌రుస సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. అందులో భాగంగా భీష్మ సినిమాను ఈ నెల 21న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమాతో పాటు కీర్తిసురేష్ జంట‌గా రంగ్‌దే సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమాకు వెంకీ అట్లూరి ద‌ర్శ‌కుడు. అలాగే చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. కాగా.. హిందీలో ఘ‌న విజయాన్ని సాధించి జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న చిత్రం అంధాదున్ సినిమా తెలుగు రీమేక్ హ‌క్కుల‌ను కూడా సొంతం చేసుకున్న సంగ‌తి కూడా తెలిసిందే. ఈ సినిమాలో కూడా నితిన్ నటించాల్సి ఉంది.

ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా జ‌రుగుతున్నాయని స‌మాచారం. లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాకు డైరెక్ట‌ర్‌గా మేర్ల‌పాక గాంధీ పేరు ప‌రిశీల‌నలో ఉంద‌ట‌. వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌, ఎక్స్‌ప్రెస్ రాజా, కృష్ణార్జున యుద్ధం సినిమాల‌ను మేర్ల‌పాక తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. వీటిలో కృష్ణార్జున‌యుద్ధం డిజాస్ట‌ర్ కావ‌డంతో మ‌ళ్లీ మేర్ల‌పాక‌కు అవకాశం రాలేదు. ఎట్ట‌కేల‌కు నితిన్‌ను డైరెక్ట్ చేసే అవ‌కాశం ద‌క్కించుకున్నాడ‌నేది స‌మాచారం. మ‌రి ఇందులో నిజానిజాలు తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.