నితిన్ గ్యాప్ తీసుకోవడం లేదా..?
Send us your feedback to audioarticles@vaarta.com
కోవిడ్ టైమ్‌లో కొత్త పెళ్లికొడుకుగా మారిన నితిన్ ప్రస్తుతం ‘రంగ్ దే’ సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత ‘అంధాదున్’ రీమేక్‌ను తెలుగులో తెరకెక్కించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ రీమేక్ నవంబర్ నుండి తెరకెక్కబోతుందని మేకర్స్ తెలిపారు. ఇందులో నభానటేశ్ హీరోయిన్గా, తమన్నా గ్రేషేడ్ ఉన్న పాత్రలో నటిస్తున్నారని తెలిపారు. దీని తర్వాత కృష్ణ చైతన్య దర్శకత్వంలో ‘పవర్‌పేట’ దర్శకత్వంలో నితిన్ నటించబోతున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి నుండి స్టార్ట్ చేయబోతున్నారని సినీ వర్గాల సమాచారం. ప్రస్తుతం షెడ్యూల్ చూస్తుంటే నితిన్ ఏమాత్రం గ్యాప్ తీసుకోవడం లేదని తెలుస్తోంది.
నితిన్ హీరోగా కృష్ణచైతన్య దర్శకత్వంలో చేయబోయే ‘పవర్ పేట’ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కనుంది. ఈ సినిమాలో మూడు షేడ్స్‌లో అంటే..20...40..60 ఏళ్ల వ్యక్తిగా మూడు షేడ్స్‌లో నితిన్ కనపడబోతున్నాడట. ఈ మూడు షేడ్స్‌ను సరికొత్తగా చూపించడానికి ఇంటర్నేషనల్ మేకప్ మ్యాన్‌ను తీసుకురావడాఆనికి నితిన్ అండ్ టీమ్ వర్క్ చేస్తుందట. మరి కరోనా పరిస్థితుల్లో ఇది ఎంత వరకు సాధ్యమవుతుందో చూడాలి. అలాగే ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్గా ఎవరిని తీసుకోవాలని పెద్ద చర్చే జరిగింది. చివరకు కీర్తిసురేష్‌నే ఎంపిక చేశారని టాక్ వినపడుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments