నవీన్ పోలిశెట్టి, అనుష్క మూవీ ఆగిపోయిందా?
Send us your feedback to audioarticles@vaarta.com
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతి రత్నాలు లాంటి సూపర్ హిట్ మూవీస్ తో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉన్న నవీన్ పోలిశెట్టి క్రేజీ హీరోగా మారిపోయాడు. జాతి రత్నాలు మూవీ అయితే బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీనితో నవీన్ తదుపరి చిత్రం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.
నవీన్ పోలిశెట్టి నెక్స్ట్ మూవీకి సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ యువీ క్రియేషన్స్ బ్యానర్ లో నవీన్ ఓ చిత్రం చేయబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. ఈ ప్రాజెక్ట్ పక్కాగా ఉండబోతున్నట్లుగానే ప్రచారం జరిగింది. ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి.
ఈ చిత్రానికి అనుష్క శెట్టి కూడా సైన్ చేసినట్లు ప్రచారం జరిగింది. కథ నచ్చడంతో అనుష్క ఓకె చెప్పిందట. దీనితో అధికారిక ప్రకటన రాకముందే ఈ మూవీపై క్రేజ్ ఏర్పడింది. కానీ తాజా సమాచారం మేరకు ఈ చిత్రం నుంచి అనుష్క తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరికొందరు ఈ మూవీనే పూర్తిగా ఆగిపోయిందని అంటున్నారు.
ఇందుకు గల కారణాలు మాత్రం తెలియలేదు. అనుష్క గత కొంతకాలంగా పెరిగిన బరువుతో ఇబ్బంది పడుతోంది. అందుకే ఆమె పెద్దగా సినిమాలు అంగీకరించడం లేదు. మరోవైపు అనుష్క కుటుంబ సభ్యులు ఆమెకు పెళ్లి ప్రయత్నాల్లో ఉన్నారని.. అనుష్క సినిమాలు తగ్గించడానికి అది కూడా ఓ కారణంగా చెబుతున్నారు.
మరి యువీ సంస్థ ఈ ప్రాజెక్ట్ ని పూర్తిగా రద్దు చేస్తుందా లేక అనుష్క స్థానంలో మరో నటిని తీసుకుంటుందా అనేది వేచి చూడాలి. అనుష్క చివరగా నటించిన చిత్రం నిశ్శబ్దం. ఈ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com