నాన్నకు ప్రేమతో..రన్ టైమ్ ప్లస్సా..మైనస్సా..

  • IndiaGlitz, [Tuesday,January 12 2016]
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన నాన్న‌కు ప్రేమ‌తో...రేపు ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. తండ్రి - కొడుకుల అనుబంధాన్ని సుకుమార్ స‌రికొత్త‌గా ఆవిష్క‌రించాడు అంటున్నారు ఎన్టీఆర్. తండ్రి కోరిక‌ను కొడుకు ఎలా నెర‌వేర్చాడ‌నేది చాలా ఇంట్ర‌స్టింగ్ గా ఉంటుంద‌ని..సినిమా ఖ‌చ్చితంగా ఘ‌న విజ‌యం సాధిస్తుంద‌ని చిత్ర‌యూనిట్ న‌మ్మ‌కంతో ఉన్నారు. అయితే నాన్న‌కు ప్రేమ‌తో...ర‌న్ టైమ్ రెండు గంట‌ల న‌ల‌భై ఎనిమిది నిమిషాలట‌. అంటే 168 నిమిషాలు. రెండున్న‌ర గంట‌లోపే ర‌న్ టైమ్ ని ఫిక్స్ చేస్తున్న ప్ర‌జెంట్ ట్రెండ్ లో నాన్న‌కు ప్రేమ‌తో...ర‌న్ టైమ్ 2 గంట‌ల 48 నిమిషాలు ఫిక్స్ చేయ‌డం విశేషం. మ‌రి..నాన్న‌కు ప్రేమ‌తో...కి ర‌న్ టైమ్ ప్ల‌స్సా..మైన‌స్సా అనేది మ‌రికొన్ని గంట‌ల్లో తెలుస్తుంది.