ఓటీటీలో రిలీజ్ కానున్న నాగచైతన్య ‘‘థ్యాంక్యూ’’.. ?
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా వైరస్ పుణ్యామా అని ఓటీటీ మార్కెట్ బాగా అభివృద్ధి చెందుతోంది. థియేటర్లు మూతపడటం, లాక్డౌన్ వల్ల ప్రజలు ఇంట్లోనే సినిమాలు వీక్షించడానికి ఇష్టపడుతున్నారు. ఇక ఓటీటీలలో వెబ్ సెరీస్‌లు బాగా పాపులర్ అవుతున్నాయి. సాధారణ నటీనటులతో పాటు స్టార్లు కూడా వెబ్ సిరీస్‌లలో నటించడానికి ముందుకొస్తున్నారు. అలాగే బడా నిర్మాణ సంస్థలు ఈ రంగంలోకి అడుగుపెట్టడంతో వెబ్‌సిరీస్‌ల హవా నడుస్తోంది. ఇప్పటికే సమంత, తమన్నా వంటి అగ్ర కథానాయికలు వెబ్ సిరీస్‌లలో నటించి సత్తా చాటారు. ఈ కోవలో హీరోలు కూడా వీటిల్లో నటించడానికి రెడీ అవుతున్నారు.
టాలీవుడ్లో ఈ సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుడుతున్నారు అక్కినేని నాగచైతన్య. వచ్చే నెలలో ఈ వెబ్‌సిరీస్ ప్రారంభంకానుంది. అయితే నాగచైతన్య కొత్త చిత్త్రం కూడా థియేటర్లలో కాకుండా డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేస్తారనే ఊహాగానాలు ఫిలింనగర్ సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి. ఈ వెబ్ సిరీస్ హర్రర్ కథాంశంతో వస్తున్నట్లు చైతూ గతంలోనే సంకేతాలిచ్చాడు. ఇందులో ఆయన నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారట. మరి తొలిసారి నెగెటివ్ రోల్లో కనిపించనున్న నాగచైతన్య ఏమేర ఆకట్టుకుంటాడో చూడాలి. ఇదిలా ఉంటే ఈ వెబ్ సిరీస్‌ను అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేయనున్నారు.
ఇకపోతే నాగచైతన్య- రాశీ ఖన్నా నటించిన థ్యాంక్యూ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇది కాకుండా తండ్రి నాగార్జునతో కలిసి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘‘బంగార్రాజు’’లో నటిస్తున్నాడు. దీనిని మాత్రం థియేటర్లలోనే రిలీజ్ చేయనున్నారు. అందుచేత ‘‘థ్యాంక్స్’’ను డైరెక్ట్ ఓటీటీలోనే ప్రీమియర్ చేయాలని నిర్మాత దిల్‌రాజు భావిస్తున్నట్లుగా ఫిలింనగర్ టాక్. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతుండగా.. ఎలాంటి నిర్ణయం ఫైనల్ కాలేదు. ‘‘థ్యాంక్యూ’’ చిత్రానికి మనం ఫేమ్ విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించారు.
కాగా.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య నటించిన ‘‘లవ్‌స్టోరీ’’ ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. అమెరికాలో మిలియన్ డాలర్ల మార్క్‌ను సైతం క్రాస్ చేసి రికార్డులు సృష్టించింది. లాక్డౌన్ తర్వాత జనాన్ని థియేటర్‌కు రప్పించింది ఈ సినిమా.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments