వర్మ ట్విట్టర్ ను వదలిపోవడానికి నాగబాబే కారణమా?
- IndiaGlitz, [Saturday,June 03 2017]
ఎప్పుడూ తనదైన కామెంట్స్‌తో, రాతలతో ఇతరులను టార్గెట్ చేసేవాళ్ళలో రాంగోపాల్ వర్మ ముందుంటారు. సోషల్ మీడియాలో భాగమైన ట్విట్టర్లో ఉన్నన్ని రోజులు వర్మను ఎవరూ కంట్రోల్ చేసేవారు కాదు. ఎవరినైనా ఏమైనా అనాలనుకుంటే వర్మకు ట్విట్టరే వేదికైంది. చిరంజీవి, పవన్‌కళ్యాణ్, నాగబాబు ఇలా ఒకరేమిటి అందరినీ వర్మ టార్గెట్ చేశాడు. అయితే ఎవరికీ చెప్పకుండా వర్మ ట్విట్టర్‌ను విడిచిపెట్టేశాడు. గన్స్ అండ్ థైస్ టీజర్ తర్వాత వర్మ ఈ పనిచేయడం టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. అసలు వర్మ ట్విట్టర్‌ను ఎందుకు వదలివెళ్ళాడనే దానిపై చాలా రకాలైన వార్తలు వినిపించాయి. అయితే వీటన్నింటికీ వర్మ బదులిచ్చాడు.
నేను కొందరిని ఇరిటేట్ చేయడానికే ట్విట్టర్‌ను వాడుకున్నాను. అలా ఇరిటేట్ చేయడం నాకిష్టం. ఇప్పుడు నాకు బోర్ కొట్టేసింది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అనే బొమ్మ నా చేతికి దొరికింది. మళ్ళీ ట్విట్టర్లోకి వెళ్ళే ఉద్దేశం నాకు లేదు. పవన్‌కళ్యాణ్, నాగబాబును ఇరిటేట్ చేయడంపై రిగ్రెట్ అవుతున్నా. నేనప్పుడు అపరిపక్వంగా పనిచేశనాఉ. ఎవరినీ హర్ట్చేసే హక్కు నాకు లేదు. నేను హర్ట్ చేసిన వాళ్ళందరికీ సారీ. నేను ట్విట్టర్‌ను విడిచిపెట్టడానికి నాగబాబు కూడా ఓ కారణం. ఇంతకు ముందులాగా ఎవరినీ వ్యక్తిగతంగా టార్గెట్ చేసి హర్ట్ చేయాలనుకోవడం లేదని వర్మ తెలిపారు.