ఓటిటి దిశగా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' ?
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా కారణంగా థియేటర్ యాజమాన్యాలు దిక్కుతోచని స్థితిలో ఉంటే.. ఓటిటి సంస్థలు మాత్రం పండగ చేసుకుంటున్నాయి. స్మాల్, మీడియం రేంజ్ నిర్మాతలు తమ చిత్రాలని ఎక్కువ కాలం హోల్డ్ చేయలేక ఓటిటీలకు అమ్మేస్తున్నారు. టాలీవుడ్ లో కొన్ని క్రేజీ చిత్రాలు కూడా ఓటిటి బాటలోనే పయనిస్తున్నాయి.
ఇదీ చదవండి: శభాష్ బాలయ్య ఫ్యాన్స్.. 500 మందికి ఉచిత వ్యాక్సిన్!
ప్రముఖ నిర్మాత బన్నీ వాసు 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అక్కినేని అఖిల్ నటిస్తున్న నాల్గవ చిత్రం ఇది. పూజ హెగ్డే హీరోయిన్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అఖిల్ బోలెడు ఆశలతో ఉన్నాడు. ఈ చిత్రంతో అయినా తనకు తొలి హిట్ దక్కుతుందని ఆశిస్తున్నాడు.
బన్నీ వాసు మాట్లాడుతూ.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ షూటింగ్ ఇక కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది. మరో యువ హీరో నిఖిల్ నటిస్తున్న చిత్రం '18 పేజెస్'. ఈ చిత్రానికి కూడా బన్నీ వాసునే నిర్మాత. ఈ చిత్రానికి కూడా 10 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందట.
ఈ రెండు చిత్రాలని థియేటర్స్ లో విడుదల చేయాలా లేక ఓటిటిలోకా అనేది ఆగస్టు లేదా సెప్టెంబర్ లో అప్పటి పరిస్థితులని బట్టి నిర్ణయం ఉంటుంది అని బన్నీ వాసు అన్నారు.
కరోనా సెకండ్ వేవ్ వల్ల చిత్ర పరిశ్రమ ప్లానింగ్ మొత్తం దెబ్బతినింది. ఏప్రిల్ నుంచి అన్ని చిత్రాల విడుదల ఆగిపోయాయి. చిన్న, మీడియం చిత్రాల నిర్మాతలు ప్రత్యామ్నాయం చూసుకోవడం మంచిది. ఒకవేళ ఇప్పుడు థియేటర్స్ తెరుచుకున్నా పెద్ద సినిమాలు రెడీగా చాలా ఉన్నాయి. కాబట్టి చిన్న చిత్రాలకు థియేటర్స్ దొరకడం కష్టంగా మారుతుంది. ఒకే వారం రెండు పెద్ద చిత్రాలు విడుదలైనా ఆశ్చర్యపోనవసరం లేదు అని బన్నీ వాసు అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com