ఎన్టీఆర్‌తో ఢీ కొట్టడానికి మంచు హీరో ఒప్పుకుంటాడా?
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా ప్రభావంతో ఏర్పడ్డ లాక్డౌన్ కారణంగా థియేటర్స్ బంద్ కావడం.. షూటింగ్స్ ఆగిపోయాయి. రెండు నెలలు తర్వాత షూటింగ్స్ ప్రారంభం అవుతున్నాయి. కానీ అన్నీషూటింగ్స్ అయితే ప్రారంభం కావడం లేదు. ఇక స్టార్ హీరోల సినిమాలు కూడా వాయిదాలు మీద వాయిదాలు పడుతూ వచ్చాయి. ఈ స్టార్ హీరోల లిస్టులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఉన్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్‌తో కలిసి భారీ బడ్జెట్ చిత్రం ‘రౌద్రం రణం రుధిరం (ఆర్ఆర్ఆర్)’లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. కరోనా ఎఫెక్ట్ లేకుండా ఉంటే ఈపాటికి చిత్రీకరణ ముగిసేది.
ఎన్టీఆర్ తదుపరి సినిమా ప్రారంభమై ఉండేది. కానీ పరిస్థితులపై కరోనా కాటు వేసింది. దీంతో అన్నీ ఆలస్యమవుతూ వస్తున్నాయి. ఎన్టీఆర్ 30 చిత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో ప్రారంభం కావాల్సి ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజా సమాచారం మేరకు ఎన్టీఆర్ 30లో విలన్‌గా మంచు మనోజ్‌ను నటింప చేస్తారని వార్తలు వినపడుతున్నాయి. ఎన్టీఆర్, మంచు మనోజ్ మధ్య మంచి స్నేహితులు. ఈ స్నేహబంధం కారణంగా మంచు మనోజ్ ఏమైనా ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకుంటాడేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com