మహేశ్ కూడా ఎంట్రీ ఇచ్చేస్తున్నాడు..?
Send us your feedback to audioarticles@vaarta.com
సినిమా మాధ్యమంకు సమాంతరంగా ఎదుగుతుంది డిజిటల్ మాధ్యమం. అమెజాన్, హాట్ స్టార్, నెట్‌ఫ్లిక్స్ వంటి టాప్ డిజిటల్ మాధ్యమాలే కాకుండా మరిన్ని ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ ఇప్పుడిప్పుడే ఎంట్రీ ఇచ్చేస్తున్నాయి. కంటెంట్ కోసం ఎవరిపైనా ఆధారపడుకుండా ముందుకు సాగడమే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌కు ఉన్న ప్లస్ పాయింట్‌గా మారింది. దీంతో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ప్యూర్ తెలుగులో ఆహా అనే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు మరికొంత మంది నిర్మాతలు వెబ్‌సిరీస్‌లను నిర్మించడానికి ఆసక్తి చూపుతున్నారు. సాయి కొర్రపాటి, శరత్ మరార్ వంటి తెలుగు నిర్మాతలు డైరెక్ట్‌గా, ఇన్‌డైరెక్ట్‌గా ఓటీటీ మాధ్యమంతో కనెక్ట్ అవుతున్నారు.
ఇప్పుడు సూపర్‌స్టార్ మహేశ్ కూడా ఓటీటీ మాధ్యమంలోకి రావడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడట. ముంబైలోని ఓ ప్రముఖ నిర్మాణ సంస్థతో కలిసి మహేశ్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ను స్టార్ట్ చేస్తాడట. ఇప్పటికే మహేశ్ కొన్ని వెబ్ సిరీస్‌లను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడని, కరోనా ప్రభావం తగ్గగానే మహేశ్ ఓటీటీ మాధ్యమంపై మరింత ఫోకస్ పెట్టబోతున్నాడని వార్తలు వినపడుతున్నాయి. మహేశ్ హీరోగానే కాకుండా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. దీంతో పాటు ఏఎంబీ సినిమాస్‌తో మల్టీప్లెక్స్ థియేటర్స్ వ్యాపారంలోకి, హంబుల్ అంటూ టెక్స్టైల్స్ బిజినెస్‌లోకి మహేశ్ ఎంట్రీ ఇచ్చాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments