మ‌హేష్ రూమ్ మేట్‌గా..

  • IndiaGlitz, [Sunday,June 24 2018]

సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు క‌థానాయ‌కుడిగా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. అగ్ర నిర్మాత‌లు సి.అశ్వ‌నీద‌త్‌, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా.. అల్ల‌రి న‌రేష్ ఓ ప్ర‌త్యేక పాత్ర‌లో న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా చిత్రీక‌ర‌ణ డెహ్ర‌డూన్‌లో జ‌రుగుతోంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో మ‌హేష్‌కు స్నేహితుడిగా అల్ల‌రి న‌రేష్ న‌టిస్తున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే.. మ‌హేష్ ఎంబీఏ చ‌దివేట‌ప్పుడు అత‌ని రూమ్ మేట్‌గా న‌రేష్‌ పాత్ర ఉంటుంద‌ని స‌మాచారం. కోటీశ్వ‌రుడైన క‌థానాయ‌కుడి పాత్ర అమెరికా వెళ్ళి సెటిల్ అవుతుంది. అయితే.. న‌రేష్ పాత్ర‌కు సంబంధించిన స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌డం కోసం రాయ‌ల‌సీమ వ‌స్తాడట.

ఆ త‌రువాత జ‌రిగే స‌న్నివేశాల స‌మాహార‌మే ఈ చిత్ర‌మ‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు ముచ్చ‌టించుకుంటున్నాయి. అంతేగాకుండా.. హిందీ చిత్రం 3 ఇడియ‌ట్స్ త‌ర‌హాలో కొన్ని స‌న్నివేశాలుంటాయ‌ట‌. మ‌రి ఈ వార్త‌ల్లో ఎంత నిజముందో త్వ‌ర‌లోనే తెలుస్తుంది. సంక్రాంతి కానుక‌గా ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

More News

క‌లిసొచ్చిన సంగీత ద‌ర్శకుడితో నాగ‌శౌర్య వ‌రుస చిత్రాలు

''చూసి చూడంగానే న‌చ్చేశావే.. అడిగి అడంగానే వ‌చ్చేశావే.. నా గుండెల్లోకి..'' అంటూ సాగే 'ఛ‌లో' చిత్రంలోని పాట ఎంత పెద్ద హిట్టో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

వ‌రుణ్ తేజ్‌కిదే తొలిసారి..

మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలను చెప్పుకోవచ్చు.

'ఆయుష్మాన్ భవ' టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్

చ‌ర‌ణ్ తేజ్ హీరోగా స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో. నేను లోక‌ల్ చిత్ర ద‌ర్శ‌కుడు త్రినాథ్ రావు న‌క్కిన స్టోరి, ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో

'ఇది నా బయోపిక్' ప్రారంభం

విశ్వ కథానాయకుడిగా పరిచయం అవుతోన్న సినిమా 'ఇది నా బయోపిక్'. నిఖిత పవర్ కథానాయిక. శివ గణేష్ దర్శకత్వంలో యువన్ టూరింగ్ టాకీస్ పతాకంపై రవిచంద్ర ఈమండి, శ్రీనివాస్ జివిరెడ్డి, నాగేంద్ర వర్మ

'చినబాబు' ఆడియో విడుదల

కార్తీ, సయేషా హీరో హీరోయిన్ గా  పాండిరాజ్ దర్శకత్వం వహించిన "చినబాబు" చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.