మహేష్ రూమ్ మేట్‌గా..
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్‌బాబు కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అగ్ర నిర్మాతలు సి.అశ్వనీదత్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా.. అల్లరి నరేష్ ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ డెహ్రడూన్‌లో జరుగుతోంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో మహేష్‌కు స్నేహితుడిగా అల్లరి నరేష్ నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. మహేష్ ఎంబీఏ చదివేటప్పుడు అతని రూమ్ మేట్‌గా నరేష్ పాత్ర ఉంటుందని సమాచారం. కోటీశ్వరుడైన కథానాయకుడి పాత్ర అమెరికా వెళ్ళి సెటిల్ అవుతుంది. అయితే.. నరేష్ పాత్రకు సంబంధించిన సమస్యను పరిష్కరించడం కోసం రాయలసీమ వస్తాడట.
ఆ తరువాత జరిగే సన్నివేశాల సమాహారమే ఈ చిత్రమని ఫిల్మ్‌నగర్ వర్గాలు ముచ్చటించుకుంటున్నాయి. అంతేగాకుండా.. హిందీ చిత్రం 3 ఇడియట్స్ తరహాలో కొన్ని సన్నివేశాలుంటాయట. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో త్వరలోనే తెలుస్తుంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com