మహేష్..వస్తున్నాడా
Send us your feedback to audioarticles@vaarta.com
ఆర్య చిత్రంతో దర్శకుడిగా పరిచయమై..జగడం, ఆర్య 2, 100% లవ్, 1 నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో...ఇలా విభిన్న కథా చిత్రాలను అందిస్తున్న డైరెక్టర్ సుకుమార్. నిర్మాతగా సుకుమార్ చేస్తున్న తొలి ప్రయత్నం కుమారి 21 ఎఫ్. ఈ చిత్రంలో రాజ్ తరుణ్, హీబా పటేల్ జంటగా నటించారు. సుకుమార్ శిష్యుడు సూర్యప్రతాప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
సుకుమార్ పై అభిమానంతో సూపర్ స్టార్ మహేష్, యంగ్ టైగర్ ఎన్టీఆర్,..కుమారి 21 ఎఫ్ సినిమాకి విషెస్ తెలియచేసారు. మహేష్, ఎన్టీఆర్ స్పందించడంతో ఈ సినిమా కి మరింత క్రేజ్ పెరిగింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన కుమారి 21 ఎఫ్ ఆడియోను ఈనెల 24న గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ ఆడియో వేడుకకు అతిధిగా సూపర్ స్టార్ మహేష్ వస్తాడని టాక్. మరి...సుకుమార్ కోసం మహేష్ వస్తాడా..? లేక సినిమా గురించి ట్వీట్ చేసాను కదా సరిపెట్టుకోమంటాడో..? చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com