మహేశ్ 27 దాదాపు ఖరారైనట్టేనా?
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేశ్ 27వ సినిమా గురించి అభిమానులు అతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది తన 26వ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’తో భారీ హిట్ అందుకున్న మహేశ్ 27వ సినిమాను వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయాలనుకున్నాడు. దిల్‌రాజు నిర్మాతగా ఆ సినిమాను నిర్మించడానికి రెడీ అయిపోయాడు. ‘సరిలేరు నీకెవ్వరు’ సక్సెస్ తర్వాత వెకేషన్‌కు వెళ్లి వచ్చిన మహేశ్, వంశీ పైడిపల్లి చెప్పిన కథ విని నచ్చకపోవడంతో సింపుల్‌గా నో చెప్పేశాడు. ఇప్పుడు మహేశ్ తన 27వ చిత్రాన్ని ఎవరితో చేస్తాడనే దానిపై పలు రకాల వార్తలు వినిపించాయి.
ముఖ్యంగా మహేశ్ 27 దర్శకుడిగా పరుశురాం పేరు వార్తల్లో వినపడుతుంది. దాంతో పాటు మరికొన్ని పేర్లు కూడా వినిపించాయి. కానీ లేటెస్ట్ సమాచారం మేరకు దాదాపు మహేష్ నెక్ట్స్ మూవీని పరుశురామ్ డైరెక్ట్ చేయడం ఖాయమైంది. ‘గీత గోవిందం’ తర్వాత దాదాపు రెండేళ్లుగా నెక్ట్స్ సినిమా కోసం వెయిట్ చేసిన పరుశురామ్ చివరకు మహేశ్‌ని లాక్ చేసుకున్నాడట. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్‌తో పాటు మహేశ్‌కి చెందిన జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ కూడా ఈ చిత్ర నిర్మాణంలో పాలు పంచుకోనుందని టాక్. మే నెలలో సినిమాను లాంఛనంగా ప్రారంభింస్తారట. జూలై నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి 2021 వేసవిలో సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com