పవన్ కోసం ‘మహర్షి’ స్పెషల్ షో.. ఈ పుకార్లు నిజమేనా!?
- IndiaGlitz, [Sunday,May 12 2019]
సూపర్‌స్టార్ మహేశ్ బాబు, పూజా హెగ్దే నటీనటులుగా వంశీ పైడిపల్లి తెరకెక్కించిన చిత్రం ‘మహర్షి’. మే-09న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అంతేకాదు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మహేశ్ నటనకు, ముఖ్యంగా వంశీ కథకు ఫిదా అయిపోయి.. సోషల్ మీడియా వేదికగా సినిమాపై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన విషయం విదితమే.
ఇక.. సినిమా ఊహించని హిట్ టాక్ సంపాదించుకుని చిత్రబృందం ఆనందంలో మునిగి తేలుతూ నాలుగు రోజులకే సక్సెస్‌మీట్ ఏర్పాటు చేసి ఫుల్ జోష్‌లో ఉంది. ఇప్పటి వరకూ ‘మహర్షి’ ఢీ కొట్టే సినిమా రాకపోవడంతో నిర్మాతల కలెక్షన్లకేం కొదవ లేకపోయింది. అయితే ఈ కలెక్షన్ల వర్షం.. ఈ జోష్ ఇలాగే కొనసాగాలంటే మరింత మంది సిని, రాజకీయ ప్రముఖులను థియేటర్లకు రప్పించి.. స్పెషల్ షో వేయించాలని చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
మొన్న ‘అన్నయ్య’.. ఇప్పుడు ‘తమ్ము్డు’ వంతు!
ఇప్పటికే ‘మహర్షి’ మూవీని మెగాస్టార్ చిరంజీవి చూసి మహేశ్‌ను అభినందించాడు. ఇక తమ్ముడి వంతు వచ్చింది.. ఇదేంటి అనుకుంటున్నారా..? అదేనండోయ్.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోసం చిత్రబృందం స్పెషల్ షో చేస్తోందని సమాచారం. సినిమాలో ఎక్కువ వ్యవసాయం రైతులకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ఏ కోణంలో చూసినా జనాలందరికి నచ్చడంతో.. వ్యవసాయం అంటే ఎక్కువగా ఇష్టపడే పవన్ కల్యాణ్ కోసం స్పెషల్ ప్లే చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే మరో రెండ్రోజులు స్పెషల్ షో ఉంటుందని సమాచారం.
పుకార్లేనా.. నిజమా..!?
కాగా.. ఏపీ ఎన్నికల్లో ఈ సారి సొంతంగా పోటీ చేసిన జనసేన మే-23 ఎప్పుడెప్పుడు వస్తుందా..? అని వేయి కళ్లతో పార్టీ నేతలు, అభ్యర్థులు, కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. మరోవైపు పవన్ కల్యాణ్ గాజువాకలో గెలుస్తారా లేదా..? ఇంతకీ భీమవరంలో పవన్ పరిస్థితి ఎలా ఉంది? అని వీరాభిమానులు వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కోసం ‘మహర్షి’ స్పెషల్ షో అని తెలుసుకుని అటు మహేశ్ అభిమానులు.. ఇటు పవన్ ఫ్యాన్స్‌లో నూతనోత్సాహం వచ్చిందట. సో.. ఈ స్పెషల్ షో వ్యవహారం ఎంత వరకు నిజమో..? తెలియాలంటే చిత్రబృందం నుంచైనా లేకుంటే పవన్ నుంచైనా రియాక్షన్ రావాల్సిందే మరి. కాగా.. ఒక హీరో సినిమాకు మరో హీరో వెళ్లడం.. ఒక హీరో సినిమాకు మరో హీరో ముఖ్య అతిథిగా వెళ్లడం టాలీవుడ్‌లో కొత్తేం కాదన్న విషయం విదితమే.