KCR: కేసీఆర్ ప్రసంగాల్లో పస తగ్గిందా..? జనాలను ఆకట్టుకోవడం లేదా..?

  • IndiaGlitz, [Tuesday,November 21 2023]

తెలంగాణ సీఎం కేసీఆర్ వాక్చాతుర్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన వాగ్ధాటితో ప్రజలను ఆకట్టుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. ఇక ఎన్నికల ప్రచారంలో అయితే ఆయన ఉపన్యాసాలు ఉరకెత్తిస్తాయి. ప్రత్యర్థి పార్టీలపై తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ ప్రజలను ఉత్తేజపరుస్తూ ఉంటారు. అలాంటి కేసీఆర్ ప్రసంగాల్లో ప్రస్తుతం వాడి తగ్గిందనే విమర్శలు వినిపిస్తు్న్నాయి. కేసీఆర్ ప్రసంగాల్లో పస తగ్గిందని.. నిస్తేజంగా సాగుతున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అన్ని పార్టీల కంటే ముందే ఏకంగా 115 మంది అభ్యర్థుల జాబితా ప్రకటించి ఆశ్చర్యపరిచారు. అప్పుడు కచ్చితంగా ఈసారి 100-110 సీట్లు గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇటీవలి ప్రసంగాల్లో బేలతనం..!

కానీ ఎన్నికల ప్రచారం ప్రారంభమయ్యాక ఆ విశ్వాసం సన్నగిల్లుతోందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. 100కి పైగా సీట్లు గెలుస్తామని ధీమా చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు 80 సీట్లు కచ్చితంగా గెలుస్తామని చెప్పడమే ఇందుకు ఉదహరణగా పేర్కొంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితి అంటూ జాతీయ పార్టీగా మార్చడంతో సెంటిమెంట్ రగల్చడానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో ఇటీవల నిర్వహించిన స‌భ‌ల్లో.. ఓడిస్తే ఏం చేస్తం.. రెస్ట్ తీసుకుంటం.. న‌ష్టపోయేది మాత్రం తెలంగాణ ప్రజ‌లే.. అంటూ బేల‌త‌నం ప్రద‌ర్శించార‌ని ప‌రిశీల‌కులు వెల్లడిస్తున్నారు. అంతేకాకుండా ఇటీవల ఓ సభలో 'హౌలే' అంటూ సొంత కార్యకర్తలను తిట్టడం.. ఎన్నికలు అన్నాక ఎవ‌రో ఒక‌రు గెలుస్తారు.. ప్రజలు ఆలోచించి ఓటు వేయాల‌ని చెబుతుండంటం ఆయనలోని అసహనాన్ని తెలియచేస్తుందంటున్నారు.

ప్రధాని మోదీపై నాటి విమ్శరలేవి..?

ముఖ్యంగా గత ఆరు నెలల ముందు దాకా అంటే కర్ణాటక ఎన్నికల ఫలితాల వరకు ప్రధాని మోదీపై ఒంటికాలిపై విమర్శలు గుప్పించేవారు. కానీ ఇప్పుడు ఆ స్థాయిలో విమర్శలు లేకపోగా.. కాంగ్రెస్ పార్టీ టార్గెట్‌గా మాత్రమే విమర్శలు చేస్తున్నారు. దీంతో బీజేపీ-బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరిందనే వాదనలు ప్రజల్లోకి బలంగా చొచ్చుకుపోయాయని అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా కనపడుతూ ఉండటంతో తుది దశ ప్రచారంలో మళ్లీ మళ్లీ తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి ఓట్లు కోసం ప్రయత్నిస్తున్నారని విమర్శలు చేస్తున్నారు.

ప్రస్తుతం కేసీఆర్ ప్రసంగాలు చూస్తే కేవలం నాలుగైదు అంశాల‌పైనే ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీని తిట్టడం.. కరెంట్, రైతు బంధు, ఓటు ప్రాధాన్య వంటి అంశాల గురించే ప్రస్తావిస్తున్నారు. దీంతో ఒకప్పుడు కేసీఆర్ ప్రసంగాల కోసం వేయికళ్లతో ఎదురుచూసే జనాలు.. ఇప్పుడు బోరింగ్‌గా ఫీల్ అవుతున్నారనే స్థాయికి వచ్చేశారని అంటున్నారు. మొత్తానికి ఒకప్పటి వాక్చాతుర్యం కేసీఆర్‌లో కొరవడిందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

More News

Pawan Kalyan: విశాఖ హార్బర్ ప్రమాద బాధితులకు సాయం చేయనున్న పవన్ కల్యాణ్

విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌లో ఆదివారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో పెద్ద సంఖ్యలో బోట్లు అగ్నికి ఆహుతి అయ్యాయి.

Hi Nanna Trailer: 'హాయ్ నాన్న' ట్రైలర్ విడుదలకు ముహుర్తం ఫిక్స్.. ఎప్పుడంటే..?

నేచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన తాజా సినిమా 'హాయ్ నాన్న'. డిసెంబర్ 7న విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా ప్రమోషన్స్‌ను ఓ రేంజ్‌లో చేస్తున్నాడు నాని.

Chiranjeevi: ఆ మాటలు అసహ్యంగా వున్నాయి.. త్రిషకి అండగా నిలబడతా: చిరంజీవి

అగ్ర కథానాయిక త్రిషపై కోలీవుడ్ సీనియర్ నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై పరిశ్రమలకు అతీతంగా అందరూ స్పందిస్తున్నారు.

YS Jagan: వర్షాల కారణంగా సీఎం జగన్ సూళ్లూరుపేట పర్యటన రద్దు

ఏపీ సీఎం జగన్ తిరుపతి జిల్లా పర్యటన రద్దైంది. మత్స్యకార దినోత్సవం సందర్భంగా సూళ్లూరుపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయాల్సి ఉంది.

Bigg Boss Telugu 7: ప్రశాంత్, గౌతమ్ మధ్య 'పంచె' పెట్టిన చిచ్చు.. అశ్విని షాకింగ్ డెసిషన్

బిగ్‌బాస్ 7 తెలుగు ఉత్కంఠగా సాగుతోంది. ఈ ఆదివారం నో ఎలిమినేషన్ అంటూ నాగార్జున షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఎవరు దక్కించుకోకపోవడంతో ఈ