కత్రినా ఓవర్ యాక్షన్ చేస్తుందా...?

  • IndiaGlitz, [Sunday,July 23 2017]

సినిమా సెలబ్రిటీస్‌, ముఖ్యంగా హీరోయిన్లు ఏం చేసినా విడ్డూరమే. నిలబడినా, కూర్చున్నా, నవ్వినా, ఏడ్చినా.. అన్నింటినీ సోషల్‌ మీడియాలో పాపులర్‌ చేసెయ్యడం చాలా మామూలు విషయం అయిపోయింది. తాజాగా కత్రినా కైఫ్‌కి సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అంతగా ఆ వీడియోలో ఏముంది అని ఆసక్తిగా చూసినవారు పెదవి విరవక మానరు. కత్రినా సాహసం పేరుతో ఈ వీడియోకి మరింత ప్రాచుర్యం కల్పించే పనిలో వున్నారు కొంతమంది.

ఇంతకీ విషయం ఏమిటంటే కత్రినా కొత్త సినిమా 'జగ్గా జాసూస్‌' షూటింగ్‌, ఆ తర్వాత ప్రమోషన్‌లో ఎక్కువ రోజులు బిజీగా వున్న కత్రినా సెలవుల్ని ఆనందంగా గడిపేందుకు మొరాకో చెక్కేసింది. అక్కడ సముద్రం అలలపై సర్ఫింగ్‌ చేస్తున్న వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. రెండు సెకన్లు కూడా సర్ఫింగ్‌ చేయని కత్రినా ఆ వీడియోను పోస్ట్‌ చేయడమే విచిత్రం అయితే, ఆ వీడియోను తమ తమ మాధ్యమాల్లో పోస్ట్‌ చేసేసి కత్రినా కైఫ్‌ని ఆకాశానికి ఎత్తేయడం మరింత విచిత్రంగా వుంది. ఏమాత్రం విషయం లేని ఇలాంటి వీడియోను పోస్ట్‌ చేయడం తగునా నీకు కత్రినా!

More News

ఇదేం దెయ్యం ఆడియో ఆవిష్కరణ

ఏ.వి రమణమూర్తి సమర్పణలో చిన్మయనంద ఫిల్మ్స్ పతాకంపై ఎస్.సరిత నిర్మిస్తోన్న చిత్రం 'ఇదేం దెయ్యం'.శ్రీనాధ్ మాగంటి హీరోగా పరిచయం అవుతున్నాడు.

డార్క్ కామెడి చిత్రంలో...

అందాల నాయిక నయనతార ఇప్పుడు తెలుగు,తమిళ చిత్రాలతో బిజి బిజీగా ఉంది.

శ్రుతి కోరిక తీరింది...

కమల్ తనయ శ్రుతి హాసన్ ఓ షూటింగ్ చిత్రీకరణ కోసం చండిగఢ్ వెళ్లింది.

ధనుష్ తెలుగు స్ట్రయిట్ మూవీ 'విఐపి 2'

ధనుష్ హీరోగా వి క్రియేషన్స్,వండర్ బార్స్ పతాకాలపై రూపొందుతున్న చిత్రం 'విఐపి2'.

సరోవరం సినిమా టీజర్ లాంచ్

శ్రీలత సినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్. శ్రీలత నిర్మాతగా పరిచయం అవుతూ కొత్త దర్శకుడు సురేష్ యాదవల్లి దర్శకత్వంలో