కత్రినా ఓవర్ యాక్షన్ చేస్తుందా...?

  • IndiaGlitz, [Sunday,July 23 2017]

సినిమా సెలబ్రిటీస్‌, ముఖ్యంగా హీరోయిన్లు ఏం చేసినా విడ్డూరమే. నిలబడినా, కూర్చున్నా, నవ్వినా, ఏడ్చినా.. అన్నింటినీ సోషల్‌ మీడియాలో పాపులర్‌ చేసెయ్యడం చాలా మామూలు విషయం అయిపోయింది. తాజాగా కత్రినా కైఫ్‌కి సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అంతగా ఆ వీడియోలో ఏముంది అని ఆసక్తిగా చూసినవారు పెదవి విరవక మానరు. కత్రినా సాహసం పేరుతో ఈ వీడియోకి మరింత ప్రాచుర్యం కల్పించే పనిలో వున్నారు కొంతమంది.

ఇంతకీ విషయం ఏమిటంటే కత్రినా కొత్త సినిమా 'జగ్గా జాసూస్‌' షూటింగ్‌, ఆ తర్వాత ప్రమోషన్‌లో ఎక్కువ రోజులు బిజీగా వున్న కత్రినా సెలవుల్ని ఆనందంగా గడిపేందుకు మొరాకో చెక్కేసింది. అక్కడ సముద్రం అలలపై సర్ఫింగ్‌ చేస్తున్న వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. రెండు సెకన్లు కూడా సర్ఫింగ్‌ చేయని కత్రినా ఆ వీడియోను పోస్ట్‌ చేయడమే విచిత్రం అయితే, ఆ వీడియోను తమ తమ మాధ్యమాల్లో పోస్ట్‌ చేసేసి కత్రినా కైఫ్‌ని ఆకాశానికి ఎత్తేయడం మరింత విచిత్రంగా వుంది. ఏమాత్రం విషయం లేని ఇలాంటి వీడియోను పోస్ట్‌ చేయడం తగునా నీకు కత్రినా!