మరో హీరోయిన్‌తో కమల్ రిలేషన్లో ఉన్నాడా?
Send us your feedback to audioarticles@vaarta.com
భారతదేశం గర్వించదగ్గ నటుల్లో లోక నాయకుడు కమల్‌హాసన్ ఒకరు. ఈయన సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఆరు దశాబ్దాలు దాటింది. నవంబర్ 7న ఆయన పుట్టినరోజు వేడుకలు జరిగాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఈ వేడులను ఘనంగానే నిర్వహిచారు. అంతే కాకుండా కమల్ హాసన్ పుట్టిన ఊరైన పరమకుడిలో ఆయన కుటుంబ సభ్యులందరూ కలుసుకున్నారు. ఇందులో చారుహాసన్, శృతిహాసన్, అక్షర హాసన్, సుహాసిని సహా ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
కేవలం కమల్‌హాసన్ కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్న ఈ కార్యక్రమంలో పూజా కుమార్ ఎందుకు పాల్గొందనేది హట్ టాపిక్ అయ్యింది. దీనిపై సోషల్ మీడియాలో పలు వార్తలు వినిపిస్తున్నాయి. కమల్‌హాసన్ ఇప్పుడు పూజా కుమార్‌తో లివ్ ఇన్ రిలేషన్ షిప్లో ఉన్నారంటున్నారు. అందుకనే కమల్ రీసెంట్గా చేసిన సినిమాలు విశ్వరూపం1, విశ్వరూపం 2, ఉత్తమ విలన్ చిత్రాల్లో పూజా కుమార్‌కు హీరోయిన్గా అవకాశాలు కల్పించారని అంటున్నారు. ప్రస్తుతం కమల్‌హాసన్ ఇండియన్ 2 సినిమాలో నటిస్తున్నారు. అలాగే మరో పక్క `మక్కల్ నీది మయ్యం` అనే పార్టీని స్థాపించి రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout