'క‌బాలి' మ‌ళ్లీ వెన‌క్కు వెళుతున్నాడా..?

  • IndiaGlitz, [Saturday,July 02 2016]

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కలైపులి థామస్ సమర్పణలో వి క్రియేషన్స్ బ్యానర్ పై పా రంజిత్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం కబాలి'. రాధికా అప్టే రజనీ సరసన నటిస్తుంది. ధన్సిక కీలక పాత్రలో నటిస్తుంది. రజనీకాంత్ గ్యాంగ్ స్టర్ గా నటించారు.ఈ చిత్రంలో ర‌జ‌నీకాంత్ మ‌లేషియావాసిగా, న‌టిస్తున్నారు. తెలుగు ఆడియో కూడా విడుద‌లైంది. సినిమాను జూలై 15న విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేశారు.

అయితే లెటెస్ట్ అప్‌డేట్ ప్ర‌కారం సినిమా ఇప్పుడు జూలై 15న విడుల కావ‌డం లేద‌ట‌. ఆగ‌స్ట్ 1న విడుద‌ల‌య్యే అవ‌కాశాలు క‌న‌ప‌డుతున్నాయ‌ని అంటున్నారు. ర‌జ‌నీకాంత్ క‌బాలి ఏమో కానీ చిన్న నిర్మాత‌లు, హీరోలేంటి. పెద్ద హీరోలు కూడా వారి సినిమాలను వాయిదా వేసుకుంటూ వ‌స్తున్నారు. మ‌రిప్పుడు ఏం జ‌రుగుతుందో చూడాలి. తెలుగులో షణ్ముక ఫిలింస్ బ్యాన‌ర్ పై కె.పి.చౌద‌రి, కె.ప్ర‌వీణ్‌కుమార్‌లు విడుద‌ల చేస్తున్నారు.