నివేదాకి వర్కవుట్ అవుతుందా?
Send us your feedback to audioarticles@vaarta.com
జెంటిల్మన్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కథానాయిక నివేదా థామస్. కేరళకి చెందిన ఈ ముద్దుగుమ్మ తొలి చిత్రంతోనే తెలుగువారిని ఆకట్టుకుంది. ఆ తరువాత వచ్చిన నిన్ను కోరితో నటిగా మరింత గుర్తింపుని తెచ్చుకుంది. ఇక మూడో చిత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్తో జైలవకుశగా చేసి మెప్పించింది. ఈ మూడు చిత్రాలు మంచి విజయం సాధించడంతో హ్యాట్రిక్ హిట్ చిత్రాల కథానాయిక అనిపించుకుంది నివేదా.
ఈ వారంలో ఈమె నటించిన మరో చిత్రం విడుదల కానుంది. అదే జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్. నవీన్ చంద్ర కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో అభినయానికి అవకాశమున్న పాత్రలో కనిపించనుంది నివేదా. జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్ కూడా విజయం సాధిస్తే.. ఒకే ఏడాదిలో మూడు చిత్రాలు విజయం సాధించిన వైనం నివేదాకి దక్కుతుంది.
మరి.. జూలియట్ నివేదాకి వర్కవుట్ అవుతుందో లేదో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com