సైరా.. ఆ వార్త నిజమేనా?
Send us your feedback to audioarticles@vaarta.com
ఖైదీ నెం.150తో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. తన 151వ చిత్రాన్ని సైరా నరసింహారెడ్డి గా చేస్తున్నారాయన. ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో భారీ తారాగణమే ఉంది. అమితాబ్ బచ్చన్, నయనతార, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహమాన్ సంగీతమందిస్తున్నట్లు సినిమా లాంచింగ్ రోజు ఎనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడా ప్రాజెక్ట్ నుంచి రెహమాన్ తప్పుకునే అవకాశముందని వార్తలు వినిపిస్తున్నాయి. తను ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులు కమిట్ అయి ఉండడం.. వాటికి ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉండడం వల్ల రెహమాన్ సైరా టీమ్ నుంచి పక్కకు వచ్చాడని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంతమేరకు నిజముందో తెలియాల్సి ఉంది.
అన్నట్టు.. సైరా మోషన్ పోస్టర్‌కి కూడా రెహమాన్ బిజీ షెడ్యూల్స్ వల్ల మరో సంగీత దర్శకుడు థమన్ మ్యూజిక్ అందించిన సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com