బ్రహ్మోత్సవం కథ ఇదేనా..?
Send us your feedback to audioarticles@vaarta.com
కొత్త బంగారులోకం చిత్రంతో దర్శకుడిగా పరిచయమై..తొలి ప్రయత్నంలోనే సక్సెస్ సొంతం చేసుకున్న యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల. ఆతర్వాత రెండో చిత్రంతోనే అగ్రహీరోలు వెంకటేష్, మహేష్..ఇద్దరితో కలసి మల్టీస్టారర్ మూవీ తెరకెక్కించి సెన్సేషన్ క్రియేట్ చేసాడు. ఇక మూడవ చిత్రంగా మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ను హీరోగా పరిచయం చేస్తూ..ముకుంద చిత్రాన్ని తెరకెక్కించి మరోసారి సంచలనం స్రుష్టించాడు.
శ్రీకాంత్ అడ్డాల..ఇంగ్లీషు సినిమాలు చూసి ఇన్ స్పైయిర్ అయి సినిమాలు తీసే రకం కాదు. నిజ జీవితంలో జరిగే సంఘటనలతోనే సినిమాలు తీసే..రకం..అదో రకం.ఇక అసలు విషయానికి వస్తే...శ్రీకాంత్ అడ్డాల తాజా చిత్రం బ్రహ్మోత్సవం. ఈ చిత్రంలో మహేష్ హీరో. కథ విషయానికి వస్తే..శ్రీకాంత్ అడ్డాల సినిమా అంటే బంధాలు..అనుబంధాలు చుట్టూ తిరుగుతుంది కథ.
ఈ సినిమాలో మహేష్ కి ముగ్గురు అత్తలు. ముగ్గురు మరదళ్లు. మహేష్, వారి మేనత్తల కుటుంబాలు చుట్టునే కథ ఉంటుంది. విజయవాడ నేపధ్యంతో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవం సినిమా కథ తిరుపతిలో ముగుస్తుందట. మరి..సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో మహేష్ ని సరికొత్తగా చూపించిన శ్రీకాంత్ అడ్డాల..బ్రహ్మోత్సవం లో మహేష్ ని ఎలా చూపించనున్నాడు..? ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేయనున్నాడో తెలుసుకోవాలంటే కొంతకాలం ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com