బ్ర‌హ్మోత్స‌వం క‌థ ఇదేనా..?

  • IndiaGlitz, [Thursday,September 10 2015]

కొత్త బంగారులోకం చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై..తొలి ప్ర‌య‌త్నంలోనే స‌క్సెస్ సొంతం చేసుకున్న యంగ్ డైరెక్ట‌ర్ శ్రీకాంత్ అడ్డాల‌. ఆత‌ర్వాత రెండో చిత్రంతోనే అగ్ర‌హీరోలు వెంక‌టేష్, మ‌హేష్..ఇద్ద‌రితో క‌ల‌సి మ‌ల్టీస్టార‌ర్ మూవీ తెర‌కెక్కించి సెన్సేష‌న్ క్రియేట్ చేసాడు. ఇక‌ మూడ‌వ చిత్రంగా మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్ తేజ్ ను హీరోగా ప‌రిచ‌యం చేస్తూ..ముకుంద చిత్రాన్ని తెర‌కెక్కించి మ‌రోసారి సంచ‌ల‌నం స్రుష్టించాడు.

శ్రీకాంత్ అడ్డాల..ఇంగ్లీషు సినిమాలు చూసి ఇన్ స్పైయిర్ అయి సినిమాలు తీసే ర‌కం కాదు. నిజ జీవితంలో జ‌రిగే సంఘ‌ట‌న‌ల‌తోనే సినిమాలు తీసే..ర‌కం..అదో ర‌కం.ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే...శ్రీకాంత్ అడ్డాల తాజా చిత్రం బ్ర‌హ్మోత్స‌వం. ఈ చిత్రంలో మ‌హేష్ హీరో. క‌థ విష‌యానికి వ‌స్తే..శ్రీకాంత్ అడ్డాల సినిమా అంటే బంధాలు..అనుబంధాలు చుట్టూ తిరుగుతుంది క‌థ‌.

ఈ సినిమాలో మ‌హేష్ కి ముగ్గురు అత్త‌లు. ముగ్గురు మ‌ర‌ద‌ళ్లు. మ‌హేష్‌, వారి మేన‌త్త‌ల కుటుంబాలు చుట్టునే క‌థ ఉంటుంది. విజ‌య‌వాడ నేప‌ధ్యంతో ప్రారంభ‌మ‌య్యే బ్ర‌హ్మోత్స‌వం సినిమా క‌థ తిరుప‌తిలో ముగుస్తుందట‌. మ‌రి..సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు చిత్రంలో మ‌హేష్ ని స‌రికొత్త‌గా చూపించిన శ్రీకాంత్ అడ్డాల‌..బ్ర‌హ్మోత్స‌వం లో మ‌హేష్ ని ఎలా చూపించ‌నున్నాడు..? ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌నున్నాడో తెలుసుకోవాలంటే కొంత‌కాలం ఆగాల్సిందే.

More News

మంచు విష్ణు హీరోగా నూతన చిత్రం ప్రారంభం

మంచు విష్ణు హీరోగా అడ్డా ఫేమ్ జి.కార్తిక్ రెడ్డి దర్శకత్వంలో నూతన చిత్రం ఈరోజు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది.

త్రివిక్రమ్ నూతన చిత్రం 'అ ఆ'

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత ల కాంబినేషన్ లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్' రూపొందించనున్న చిత్రం పేరు ఇది.

మ‌హేష్ పై వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన తేజ‌

సూప‌ర్ స్టార్ మ‌హేష్ తాజా చిత్రం శ్రీమంతుడు. ఈ చిత్రంలో హ‌ర్ష పాత్ర‌లో న‌టించిన మ‌హేష్ ఓ ఊరు ద‌త్త‌త తీసుకుని ఆ ఊరు రూపురేఖ‌లే మార్చేస్తాడు.

జ‌యం సినిమా మ‌ళ్లీ చూసిన‌ట్టుంద‌ట‌

తేజ తెర‌కెక్కించిన తాజా చిత్రం హోరా హోరి.నూత‌న న‌టీన‌టుల‌తో రూపొందిన హోరా హోరి చిత్రం ఈ నెల 11న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

'తిక్క'చూపిస్తాడట...

సాయిధరమ్తేజ్ హీరోగా సునీల్ రెడ్డి దర్శకత్వంలో కొత్త చిత్రం ‘తిక్క’. శ్రీ వెంకటేశ్వర మూవీ మేకర్స్ బ్యానర్పై సి.రోహిణ్ కుమార్రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.