స్టార్ హీరో పక్కన అంటే అంతేనా..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు సినిమాల విషయంలో కెరీర్ ని ప్రారంభించిన మూడేళ్లకుగానీ తొలి హిట్‌ని అందుకోలేకపోయింది బెంగుళూరు బ్యూటీ ప్రణీత. 'ఏం పిల్లో ఏం పిల్లడో' తో మొదలైన ఈ అమ్మడి టాలీవుడ్ జర్నీ.. పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది'తో స్పీడ్ అందుకుంది. ఆ సినిమా వచ్చి అటుఇటుగా మూడేళ్లవుతోంది. ఈ గ్యాప్‌లో చేసింది నాలుగు తెలుగు చిత్రాలే అయినా వాటిలో రెండు సినిమాల కోసం స్టార్ హీరోల పక్కన నటించే అవకాశం వచ్చింది ప్రణీతకి.
ఆ ఇద్దరు స్టార్ హీరోలు ఎన్టీఆర్, మహేష్‌బాబు. తారక్‌తో 'రభస' చేసిన ప్రణీత.. మహేష్‌తో 'బ్రహ్మోత్సవం' కోసం జోడీకట్టింది. విశేషమేమిటంటే.. పవన్, తారక్, మహేష్ ఇలా అగ్ర కథానాయకులందరికి మరదలు వరసయ్యే పాత్రల్లోనే ప్రణీత నటించడం. మొత్తమ్మీద.. స్టార్ హీరో పక్కన అంటే చాలు నిడివి తక్కువ ఉండే మరదలు లేదా మరదలు అని పొరపడాల్సిన పాత్రో ప్రణీతని వరిస్తోంది. భవిష్యత్‌లో అయినా ప్రణీతకి ఈ మరదలు కష్టాలు తప్పుతాయో లేదో మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout