క్రిష్ సినిమాకు ఆధారం అదేనా..!
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌తో పీరియాడిక్ మూవీ స్టార్ట్ చేసిన జాగర్లమూడి క్రిష్‌కు కరోనా వైరస్ పెద్ద షాకే ఇచ్చింది. షూటింగ్ ఆపేశాడు. వకీల్‌సాబ్ పూర్తి చేసిన తర్వాత కానీ.. పవన్ నెక్ట్స్ మూవీపై క్లారిటీ ఉండదు. అయితే ఈ గ్యాప్‌ను క్రిష్ మరో సినిమాతో పూర్తి చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నాడు. అందులో భాగంగా వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్‌తో ఓ సినిమా ప్లాన్ చేశారు . షూటింగ్ కూడా షురూ అయ్యింది. ఈ సినిమాను అక్టోబర్ ద్వితీయార్థానికంతా పూర్తి చేసేలా ప్లాన్ చేసుకున్నారు. అందుకు తగినట్లు శరవేగంగా షూటింగ్ కూడా జరుగుతుంది.
తాజాగా సినీ వర్గాల్లో వార్తొకటి హల్‌చల్ చేస్తుంది.. అదేంటంటే కొండపొలం అనే నవలను ఆధారంగా చేసుకునే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ నవలకు తానా సంస్థ రెండు లక్షల రూపాలయ బహుమతిని కూడా అనౌన్స్ చేసింది. గిరిజనులు కొండ మీద చేసే వ్యవసాయం, ఆ వ్యవసాయం చేసే సమయంలో జంతువులు, వాతావరణంతో కలిగే ఇబ్బందులు ఆధారంగా ఈ పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకాన్ని బేస్ చేసుకుని సినిమాను క్రిష్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను పూర్తి చేసిన తర్వాత పవన్ సినిమాపై క్రిష్ ఫోకస్ పెడతారట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments