మళ్లీ ‘ప్రేమ’ నేర్చుకోవడం సాధ్యమేనా..!
Send us your feedback to audioarticles@vaarta.com
పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ సినీ ప్రియులు, జనసేన కార్యకర్తలు, అభిమానులకు కొత్త పరిచయం చేయనక్కర్లేదు. నిత్యం సోషల్ మీడియాలో తన అభిమానులకు టచ్‌లో ఉండే రేణు.. ఇటీవల ఓ ఆసక్తికర, సంచలన విషయాన్ని వెల్లడించింది. ఆ పోస్ట్‌లో మనసులోని భావాలను కవితల రూపంలో చెబుతూ అభిమానుల్లో నూతనోత్సాహం నింపుతుంటుంది. "మళ్ళీ ప్రేమ నేర్చుకోవడం సాధ్యమేనా? మొట్టమొదటి సారి ప్రేమలో పడ్డప్పటి నవ్వు ఇప్పుడు దొరుకుతుందా? అద్దంలో మీ ముఖం చూసుకుంటే మీరు కోల్పోయింది ఏమిటో మీకు అర్థమవుతుంది?" అని రేణుదేశాయ్ చాలా ఆసక్తికమైన కవితను తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది.
కాగా.. ఈ పోస్ట్‌పై రేణు, పవన్ అభిమానులు పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతున్నారు. రేణు ఆషామాషీగా ఏ విషయం చెప్పరని.. ఆమె కవితలో చాలా అర్థాలు, పరమార్థాలు ఉన్నాయని అభిమానులు చెబుతున్నారు. రేణు తన పర్సనల్ లైఫ్ రిఫ్లెక్ట్ చేసే విధంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. రేణు సినిమా రంగానికి వచ్చిన కొత్తలోనే పవన్ కళ్యాణ్ మీద మనసు పారేసుకుని.. అతడితో సహజీవనం, పెళ్లి, పిల్లలు, విడాకుల తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా.. త్వరలోనే పూణెకు చెందిన వ్యక్తిని రేణు మరో పెళ్లి చేసుకోబోతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments