అక్కినేని హీరోల నెలకో సినిమా సాధ్యమేనా...?
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని నాగార్జున రెండో వారసుడు అఖిల్ ను హీరోగా పరిచయం చేస్తూ...అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం అఖిల్. ఈ చిత్రాన్ని వి.వి.వినాయక్ డైరెక్షన్ లో యంగ్ హీరో నితిన్ నిర్మిస్తున్నారు. అక్కినేని జయంతి సందర్భంగా ఈ నెల 20న అఖిల్ ఆడియోను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అటు అక్కినేని వంశాభిమానులు ఇటు ఇండస్ట్రీ అఖిల్ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే... దసరా కానుకగా దసరా బుల్లోడు మనవడు అఖిల్ అక్టోబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.
ఇక...అఖిల్ తర్వాత అఖిల్ అన్నయ్య నాగచైతన్య సాహసం శ్వాసగా సాగిపో...చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈచిత్రాన్ని గౌతమ్ మీనన్ తెరకెక్కిస్తున్నారు. రచయిత కోన వెంకట్ నిర్మిస్తున్నారు. ఏమాయ చేసావే చిత్రంలో చైతును లవర్ బాయ్ గా చూపించిన గౌతమ్ మీనన్ ఈసారి సాహసం శ్వాసగా సాగిపో...చిత్రంలో లవ్ తో పాటు యాక్షన్ ను కూడా టచ్ చేస్తున్నాడు. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఈ మూవీని నవంబర్ లో రిలీజ్ చేయనున్నట్టు ప్రచారం జరుగుతుంది. నవంబర్ 23 నాగచైతన్య పుట్టనరోజు. సో...చైతు పుట్టినరోజు కానుకగా నవంబర్ 23నే రిలీజ్ చేయచ్చు.
అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం సోగ్గాడే చిన్ని నాయన. చిత్రాన్ని నూతన దర్శకుడు కళ్యాణ్ క్రిష్ణ తెరకెక్కిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మిస్తున్నారు. నాగ్ ఈ మూవీలో డ్యూయల్ రోల్ చేస్తున్నారు. నాగ్ సరసన రమ్యక్రిష్ణ, లావణ్య త్రిపాఠి నటిస్తున్నారు. విభిన్న కథాంశంతో రూపొందుతున్న సొగ్గాడే చిన్ని నాయన చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ నెల 20కి షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. ఈ చిత్రాన్ని నాగ్ సెంటిమెంట్ మంత్ అయిన డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని టాక్.
అయితే అఖిల్, అక్టోబర్, నాగచైతన్య నవంబర్, నాగార్జున డిసెంబర్...ఇలా అక్కినేని హీరోలు నెలకో సినిమాని రిలీజ్ చేయనున్నట్టు ప్రచారం జరుగుతుంది. కానీ...చైతన్య సాహసం శ్వాసగా సాగిపో చిత్రం షూటింగ్ యాభైశాతమే అయ్యింది. అందువలన చైతు సినిమా రిలీజ్ నవంబర్ లోఉండకపోవచ్చు అనేది సమాచారం. మరి...ప్రచారంలో ఉన్నట్టు అక్కినేని హీరోల నెలకో సినిమా రిలీజ్ సాధ్యమేనా...కాదా...తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments