మహేష్ 25 కాన్సెప్ట్ అదేనా?
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ బాబు, ఉత్తరాది భామ పూజా హెగ్డే జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో "మహేష్ 25వ సినిమా" తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్స్ అశ్వనీదత్, 'దిల్' రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన నాలుగు పాటలని ఓకే చేసారు దర్శక నిర్మాతలు.
ఇదిలా ఉంటే.. స్నేహానికి అర్ధం చెప్పిన కృష్ణుడు, కుచేలుడు కథకు మోడ్రన్ వెర్షన్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో.. కృష్ణుడి లాంటి ధనికుడి పాత్రలో మహేశ్, కుచేలుడు లాంటి పేదవాడి పాత్రలో 'అల్లరి' నరేష్ కనిపించనున్నారని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో.. తాజాగా 'అల్లరి' నరేష్ అగ్రిమెంట్‌పై సంతకం చేసి.. జూలై నుంచి తన కాల్ షీట్స్‌ను కూడా కేటాయించారు. ఫస్ట్ హాఫ్‌లో కామెడీతో ఆకట్టుకునే ఈ క్యారెక్టర్.. సెకండ్ హాఫ్‌లో సెంటిమెంట్‌ను పండించేదిగా ఉంటుందనీ.. ఇది తన కెరీర్‌కు మరింత ప్లస్ అవుతుందని 'అల్లరి' నరేష్ చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. ఇప్పటికే తొలి షెడ్యూల్ ప్రారంభం కావాల్సి ఉండగా.. మహేష్ కుటుంబంతో కలిసి హాలిడే ట్రిప్‌కి వెళ్ళడంతో ఈ షెడ్యూల్‌ను జూన్ రెండో వారానికి వాయిదా వేశారు. అలాగే తొలి షెడ్యూల్‌ను డెహ్రాడున్‌లో చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. కాగా.. న్యూయార్క్, రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో మహేష్ ట్రిమ్ చేసిన గడ్డం, మీసంతో రఫ్ అండ్ టఫ్ లుక్‌లో కనిపించనున్నారని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments