సమంత చెప్పింది చైతు గురించేనా..
Send us your feedback to audioarticles@vaarta.com
అందాల బొమ్మ సమంత ఇటీవల ఓ ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్ వ్యూలో టాలీవుడ్ యంగ్ హీరోతో లవ్ ఉన్నాను అని తెలియచేసింది. అప్పటి నుంచి సమంత ప్రేమలో పడింది ఏ హీరోతో అంటూ కొంత మంది హీరోల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అ ఆ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్ వ్యూలో నితిన్ ని ఇదే విషయం గురించి ప్రశ్నిస్తే...సమంత ఏ హీరోతో లవ్ లో పడిందో నాకు చెప్పలేదు కానీ...ఆ హీరో ఎవరో అందరికీ తెలుసు కదా అన్నాడు.
ఇదిలా ఉంటే...అ ఆ చిత్రాన్నినిన్న నాగ చైతన్య, సమంత కలిసి బంజారా హిల్స్ లో ఓ మల్టీప్లెక్స్ లో చూసారట. చైతన్య, సమంత కలిసి సినిమా చూస్తున్నప్పటి ఫోటోస్ సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో హల్ చల్ చేస్తున్నాయి. చైతన్య, సమంత కలిసి ఏమాయ చేసావే, మనం ఆటోనగర్ సూర్య చిత్రాల్లో నటించారు. అప్పటి నుంచి చైతు, సమంత మంచి ఫ్రెండ్స్. మరి.. చైతన్య, సమంత కేవలం ఫ్రెండ్స్ మాత్రమేనా...? లేక ప్రచారంలో ఉన్నట్టు ప్రేమికులా అనేది చైతన్య, సమంత కే తెలియాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com