Meena : రెండో పెళ్లికి సిద్ధమవుతోన్న మీనా.. వరుడెవరంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
వివాహ బంధంలో మనస్పర్ధల కారణంగా జీవిత భాగస్వామితో విడిపోయి సింగిల్‌గా వుంటోన్న సినీతారలు ప్రస్తుతం తోడు వెతుక్కునే పనిలో పడ్డారు. చిన్న వయసులో వున్న వారైతే వెంటనే రెండో పెళ్లి చేసుకోవచ్చు. కానీ లేటు వయసులో వున్న వారి కష్టాలు వర్ణనాతీతం. సమాజానికి, కట్టుబాట్లకు భయపడి వారు మరో పెళ్లి చేసుకోవడానికి భయపడేవారు. కానీ సింగర్ సునీత ఈ అడ్డంకులను అధిగమించి పెళ్లీడుకు వచ్చిన ఇద్దరు పిల్లలున్నప్పటికీ తన మనసుకు నచ్చిన వ్యక్తిని రెండో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. సునీత చూపిన దారిలో మరికొందరు నడిచారు, ఇంకా నడుస్తున్నారు కూడా.
భర్త క్లోజ్ ఫ్రెండ్‌తో మీనా పెళ్లి:
ఈ లిస్ట్‌లో సీనియర్ నటి మీనా కూడా చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొద్దినెలల క్రితం అనారోగ్యంతో మీనా భర్త విద్యాసాగర్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. భర్త మరణం నుంచి ఇప్పుడిప్పుడే ఆమె కోలుకుంటున్నారు. ఈ దంపతులకు పదేళ్ల పాప వుండటంతో చిన్నారి ఆలనా పాలనా చూసుకుంటూ మీనా జీవిస్తున్నారు. అయితే మీనాను ఆమె పేరెంట్స్ రెండో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారట. కుమార్తె భవిష్యత్త్తో పాటు తన భవిష్యత్ కూడా బాగుండాలంటే మగతోడు అవసరమని వారు మీనాకు నచ్చజెబుతున్నారట. ఈ నేపథ్యంలోనే మీనా తన ఫ్యామిలీకి బాగా తెలిసిన వ్యక్తిని ద్వితీయ వివాహం చేసుకోబోతున్నారనే వార్త గుప్పుమంది. అతనితో మీనా భర్త విద్యాసాగర్‌కు మంచి సంబంధం వుండేదట. ఈ క్రమంలో మీనా వివాహం దాదాపు ఖాయమేననే న్యూస్ వైరల్ అవుతోంది. అయితే దీనిపై మీనా కానీ, ఆమె కుటుంబ సభ్యులు, సన్నిహితులు స్పందించాల్సి వుంది.
అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయిన మీనా భర్త:
కాగా.. 90వ దశకంలో మీనా దక్షిణాదిలో అగ్ర కథానాయికగా వెలుగొందారు. పెళ్లయిన తర్వాత కొన్నాళ్లు నటనకు దూరంగా వున్నప్పటికీ ఆ తర్వాత రియాలిటీ షోలకు జడ్జిగానూ, కొన్ని సినిమాల్లోనూ మీనా నటించారు. కెరీర్ ముగుస్తున్న దశలో విద్యాసాగర్‌ను 2009లో పెళ్లాడారు మీనా. కానీ విధి చిన్న చూపు చూడటంతో విద్యాసాగర్ అనారోగ్యం బారినపడి కన్నుమూశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout